Ajit Pawar Finance Minister : మహారాష్ట్ర అధికార ప్రభుత్వంలో చేరిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎట్టకేలకు శుక్రవారం శాఖల కేటాయింపు జరిగింది. ఎన్‌సీపీ సీనియర్ నేత, డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు కీలకమైన ఆర్థిక శాఖ దక్కింది. వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక శాఖ ఇంతవరకు బీజేపీ సీనియర్ నేత, మరో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ చేతిలో ఉంది.
Maharashtra Cabinet Portfolio :మంత్రులు.. శాఖలు..
- అజిత్ పవార్.. ఫైనాన్స్, ప్లానింగ్
- ఛగన్ భుజ్‌బల్.. పౌర సరఫరాలు
- దిలీప్ వాల్సే పాటిల్.. సహకార శాఖ
- ధనంజయ్ ముండే.. వ్యవసాయ శాఖ
- అదితి తట్కరే.. మహిళా శిశు సంక్షేమం
- హసన్ ముష్రీఫ్.. వైద్యవిద్య
- ధర్మారావు ఆత్రం.. ఆహార, ఔషధ నియంత్రణ
- సంజయ్ బన్సొడే.. క్రీడలు
- అనిల్ పాటిల్.. పునరావాసం, విపత్తు నిర్వహణ శాఖ
12 రోజుల ప్రతిష్టంభనకు తెర!
Maharastra Cabinet Expansion : ఎన్‌సీపీలో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అజిత్ పవార్జులై 2న మహారాష్ట్రలోని బీజేపీ- శివసేన(శిందే) ప్రభుత్వంలో చేరుతున్నట్టు ప్రకటించారు. తనకు 40మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉందని, తమదే అసలైన ఎన్‌సీపీ పార్టీ అని ఆయన ప్రకటించారు. ఎన్‌సీపీతరఫునే తాము ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నామన్నారు.
అజిత్ పవార్ప్రభుత్వంలో చేరిన రోజే ఉపముఖ్యమంత్రిగా, ఆయన తరఫున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పటి నుంచి శాఖల కేటాయింపు జరగకపోవడం వల్ల ప్రతిష్టంభన నెలకొంది. కీలకమైన ఆర్థిక శాఖ, కోఆపరేటివ్ మంత్రిత్వ శాఖ కోసం పవార్ పట్టుబట్టినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, అజిత్ పవార్, ఫడణవీస్ మధ్య గురువారం రాత్రి చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎన్‌సీపీ నేతలకు కేటాయించిన మంత్రిత్వ శాఖల జాబితాను శిందే సర్కార్.. శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్ బైస్‌కు పంపింది. ఆయన దానికి వెంటనే ఆమోదం తెలియజేశారు. అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది.
మొదటి మహిళా మంత్రిగా అదితి!
Maharashtra Cabinet News : ఎన్‌సీపీ తొమ్మిది మంది మంత్రుల చేరికతో మహారాష్ట్ర కేబినెట్‌లో మొత్తం మంత్రుల సంఖ్య 29కి చేరుకుంది. కేబినెట్‌లో అదితి తట్కరేకు అవకాశం కల్పించడం వల్ల శిందే మంత్రివర్గంలో ఆమె మొదటి మహిళ మంత్రిగా నిలిచారు.