Ajeyakalam Approved the Siemens Project :‘‘ఒక ప్రాజెక్టు ఆమోదించడం, బడ్జెట్ కేటాయించడం కంటే ముందే అది సక్రమంగా ఉందో లేదో సమగ్రంగా పరిశీలించాలని. సీమెన్సు ప్రాజెక్టును (Siemens Project) ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా ఆమోదించింది అప్పటి అధికారి అజేయకల్లామేనని.. గత ప్రభుత్వంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన పీవీ రమేష్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిబంధనల ప్రకారం సరిగా అమలు జరిగేలా చూడాల్సింది నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యదర్శి ప్రేమ్‌చంద్రారెడ్డేనన్నారు. నిధుల విడుదల సమయంలోనూ బాధ్యత ఆ శాఖదేనని పేర్కొన్నారు. సీమెన్స్‌తో ఒప్పందం, నైపుణ్య కేంద్రాల ఏర్పాటు ప్రాజెక్టుకు సంబంధించి సీఐడీ అధికారులు విచారణ క్రమంలో గతంలో ఆయనకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.
Chief Secretary of the Finance Department PV Ramesh Comments on Siemens Project:నైపుణ్యాభివృద్ధి సంస్థ పీడీ ఖాతా నుంచి రెండు విడతల్లో 300 కోట్లు ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించడానికి ముందు మీరు సంతృప్తి చెందారా అని సీఐడీ ప్రశ్నించింది. ఆర్థిక కార్యదర్శి సమక్షంలో డిజైన్ టెక్ డైరెక్టర్‌తో జరిగిన చర్చలపైనా ప్రశ్నలు అడిగింది. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా అయిదేళ్లు పని చేసిన సమయంలో తాను ఒక బాహ్య సంస్థను కలవడం అసాధారణమని పీవీ రమేశ్ బదులిచ్చారు. నైపుణ్యాభివృధ్ధి సంస్థ అధికారులు, ఆర్థికశాఖ కార్యదర్శి సమక్షంలో డిజైన్ టెక్ డైరెక్టర్‌తో సమావేశం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టుపై పూర్తి స్పష్టత పొందేందుకు, సంబంధిత శాఖ పూర్తి సమాచారం అందించలేని పరిస్థితుల్లోనే వారితో సమావేశమైనట్లు బదులిచ్చారు. తాను సిఫార్సు చేసిన అన్ని అంశాలను సంపూర్ణంగా అమలు చేస్తామని నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యదర్శి ప్రేమ్‌చంద్రారెడ్డి పదే పదే హామీ ఇచ్చిన విషయం గుర్తుందన్నారు.
Pawan Kalyan on Chandrababu Arrest: మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్న పవన్‌కల్యాణ్
PV Ramesh Comments on Siemens Project :గుజరాత్‌లో పర్యటించిన బృందం పరిశీలనలు మినహా..సీమెన్సు ఇండియా, డిజైన్ టెక్‌లు పేరున్న సంస్థలని నిర్ధారించడానికి ఆధారం ఏమిటని సీఐడీ ప్రశ్నించింది. గుజరాత్ సందర్శించిన బృందం పరిశీలన, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు ఇచ్చిన సమాచారం తప్ప ఆ రెండు సంస్థలు పేరున్న సంస్థలని నిర్ధారించుకోవడానికి తనకు ఇతర మార్గాలు ఏవీ లేవని పీవీ రమేశ్ బదులిచ్చారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు ఈ రెండు సంస్థలు ఎంతో పేరున్నవని చెప్పిన విషయం తనకు గుర్తుందన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించే అవకాశం ఉన్న ఉన్నతాధికారుల మాటలు నమ్మకపోతే కార్యాలయంలో మాత్రమే ఉండే అధికారి ఎలా పని చేయగలరని ఎదురు ప్రశ్నించారు.
Premchandra Reddy is responsible for Implementation of the Siemens Project :సీమెన్సు ఇండియా, డిజైన్ టెక్ సంస్థలు 90శాతం ఖర్చు చేశాయని ఎలా నిర్ధారిస్తారని.. గ్రాంటు స్వభావం ఏమిటో పరిశీలించారా..ఏ సాంకేతిక భాగస్వామి వాటా ఎంత శాతం? అసలు ఖర్చు ఎంత? గ్రాంటు తర్వాత ఖర్చు ఎంత అయిందో మీరు ధ్రువీకరించారా అని సీఐడీ ప్రశ్నించింది. ఈ ప్రాజెక్టును ఆమోదించడానికి, బడ్జెట్ కేటాయింపులకు ముందే ఈ అంశాలన్నీ పరిశీలించాల్సి ఉందని...ఇది పూర్తిగా నైపుణ్యాభివృద్ధి సంస్థ బాధ్యతని...దాన్ని సమీక్షించాల్సింది ఆర్థికశాఖ అని పీవీ రమేశ్ సమాధానం ఇచ్చారు.
ఆ తర్వాత మంత్రిమండలి పరిశీలించి ఆమోదించాలన్నారు. శాసనసభ అవసరమైన బడ్జెట్ కేటాయిస్తుందని... ప్రాజెక్టుపై పడే భారం, తదితర అన్ని అంశాలను ప్రాజెక్టు ఆమోదించే సమయంలోను, నిధులు కేటాయించే సమయంలోనే సమగ్రంగా పరిశీలించాలన్నారు. ఈ కసరత్తు అంతా తాను ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు తీసుకోవడాని కన్నా ముందే అప్పటి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి అజేయకల్లాం ఆధ్వర్యంలోనే జరిగిందన్నారు. ఆ తర్వాత మంత్రిమండలి ఆమోదించిందని... ఈ ప్రాజెక్టును సంబంధిత అధికారులు ఆమోదించిన తర్వాత అప్పటికే అమలులో ఉన్న విధివిధానాల ప్రకారం బడ్జెట్ కేటాయిస్తారని...నిధులు విడుదల చేస్తారని సమాధానం ఇచ్చారు.
అప్పటి నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యదర్శి ప్రేమ్‌చంద్రారెడ్డి మొత్తం డాక్యుమెంట్లు అన్నీ ఆర్థికశాఖకు సమర్పించారని పేర్కొన్నారని... డిజైన్ టెక్‌కు ముందుగానే నిధులు విడుదల చేసే క్రమంలో వీటన్నింటినీ పరిశీలించి సరి చూసుకున్నారా అన్న సీఐడీ ప్రశ్నించింది. ఆర్థిక శాఖ, లేదా ఆర్థికశాఖ కార్యదర్శి ప్రోద్బలంతోనే నిధులు విడుదలవుతాయనేది అసంబద్ధమన్న పీవీ రమేశ్.... అది ప్రేమ్‌చంద్రారెడ్డి కావచ్చు, మరి ఎవరైనా కావచ్చన్నారు. ఆశాఖ ముఖ్య కార్యదర్శి, విభాగాధిపతి, అక్కడి అధికారులే నిధులు సవ్యంగా వినియోగమయ్యేలా చూసేందుకు ప్రధాన బాధ్యులని బదులిచ్చారు.