Ajay mishra blackmailing: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాను బెదిరించిన ఐదుగురు సభ్యుల ముఠాను దిల్లీ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ కస్టడీకి తరలించారు.
లఖింపుర్ ఖేరి ఘటనకు సంబంధించి కొందరు తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని కొద్ది రోజుల క్రితం అజయ్ మిశ్రా దిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ అస్థానాకు ఫిర్యాదు చేశారు. ఐదుగురు రోజు ఫోన్ చేసి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కేంద్రమంత్రి ఫిర్యాదు మేరకు నార్త్ అవెన్యూ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రత్యేక బృందం దర్యాప్తు ప్రారంభించి మంత్రిని బ్లాక్మెయిల్ చేసిన ఐదుగురిని అరెస్టు చేసింది. వీరిలో నలుగురు నోయిడాకు చెందినవారు కాగా.. ఒకరు దిల్లీ వాసి.