తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా విజృంభణపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని తెలిపింది. కరోనా నివారణ చర్యలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించింది.

ajay bhalla writes letter to states on covid cases surge
కరోనా విజృంభణపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ

By

Published : Mar 19, 2021, 10:53 PM IST

దేశంలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తున్నందున రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా లేఖ రాశారు. కరోనా వ్యాప్తిపై నిఘా, నియంత్రణ, జాగ్రత్తల కోసం జారీ చేసిన మార్గదర్శకాలను మార్చి 31 వరకు పొడిగించినట్టు తెలిపారు. కరోనా నియంత్రణ కోసం ప్రజలంతా మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతుల్ని శుభ్రపరుచుకొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కేంద్ర హోంశాఖ ఆదేశాలను రాష్ట్రాలు కచ్చితంగా పాటించాలని అజయ్​ భల్లా సూచించారు. కరోనా కేసులు ఐదు నెలలుగా క్షీణించినట్టు కనబడినా కొన్ని వారాలుగా మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘనలు తమ దృష్టికి వచ్చినట్టు అజయ్ భల్లా లేఖలో ప్రస్తావించారు. రాబోయే పండుగలను దృష్టిలో పెట్టుకొని కొవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సూచించారు. కరోనా నివారణ చర్యలు, మార్గదర్శకాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్రాలకు స్పష్టం చేశారు. మరోవైపు, ఈ రోజు మహారాష్ట్రలో 25,600లకు పైగా కొత్త కేసులు రాగా.. దిల్లీలో 700లకు పైగా నమోదయ్యాయి.

ఇదీ చూడండి:భారత్​లో 4 కోట్ల మైలురాయి దాటిన వ్యాక్సినేషన్​

ABOUT THE AUTHOR

...view details