తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈడీ ముందుకు ఐశ్వర్య రాయ్​.. 4 గంటలకుపైగా విచారణ - ఐశ్వర్య రాయ్ పనామా పేపర్లు

Aishwarya ED notice: పనామా పత్రాల కేసులో ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్​ ఈడీ ముందు సోమవారం హాజరయ్యారు. దిల్లీ జామ్​నగర్​ హౌస్​లోని ఈడీ కార్యాలయంలో విదేశీ మారకద్రవ్య నిబంధనల ఉల్లంఘన కింద ఐశ్వర్యను సుమారు 4 గంటలకుపైగా ప్రశ్నించారు అధికారులు.

aishwarya ed notices
aishwarya ed notices

By

Published : Dec 20, 2021, 11:44 AM IST

Updated : Dec 20, 2021, 7:17 PM IST

ED summons Aishwarya Rai: పనామా పత్రాల వ్యవహారంలో బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందు సోమవారం హాజరయ్యారు. పన్ను ఎగవేసి విదేశాలకు నగదు తరలించారనే ఆరోపణలపై ఐశ్వర్యను ప్రశ్నించేందుకు నోటీసులు ఇవ్వగా.. సోమవారం ఈడీ కార్యాలయానికి వచ్చారు.

4 గంటలకుపైగా..

సుమారు 4 గంటలకుపైగా ఐశ్వర్యను ప్రశ్నించారు అధికారులు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో దిల్లీ జామ్​నగర్​లోని ఈడీ కేంద్ర కార్యాలయానికి రాగా.. సాయంత్రం 7 గంటల తర్వాత బయటకు వచ్చారు ఐశ్వర్య.

గతంలో సమన్లు ఇచ్చినప్పుడు సమయం కోరిన ఐశ్వర్యరాయ్ సోమవారం కూడా హజరు కాలేనని ఈడీకి సమాచారం ఇచ్చారు. అయితే అకస్మాత్తుగా దిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు.

ప్రపంచంలోని అత్యంత ధనికులు, శక్తిమంతమైన వ్యక్తులు పన్నులు ఎగ్గొట్టడానికి షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు నిధులు తరలించారని.. 2016లో లీకైన పనామా పత్రాల్లో ఉంది. ఆ పత్రాల్లో ఐశ్వర్య సహా భారత్‌కు చెందిన ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. ఈ విషయంలో ఆర్బీఐ నిబంధనల మేరకు 2004 నుంచి విదేశాలకు పంపిన ధనం వివరాలు తెలిపాలని గత నోటీసుల్లోనే ఈడీ పేర్కొంది. ఇప్పుడు అందుకు సంబంధించిన వివరాలను ఐశ్వర్య రాయ్‌ను ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:ఈడీ విచారణకు బాలీవుడ్​ నటి​- ఆ 50 ప్రశ్నలకు జవాబు దొరికేనా?

Last Updated : Dec 20, 2021, 7:17 PM IST

ABOUT THE AUTHOR

...view details