Airport Jobs 2023 : ఏవియేషన్ రంగంలో జాబ్ కోసం చూస్తున్న ఆశావాహులకు గుడ్న్యూస్. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) మొత్తం 119 జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆసక్తిగల యువతీయువకులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు
Jr Assistant & Sr Assistant Vacancy 2023 :119 జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
- జూనియర్ అసిస్టెంట్(ఫైర్ సర్వీస్)- 73
- జూనియర్ అసిస్టెంట్(ఆఫీస్)- 02
- సీనియర్ అసిస్టెంట్(ఎలక్ట్రానిక్స్)- 25
- సీనియర్ అసిస్టెంట్(అకౌంట్స్)- 19
కావాల్సిన అర్హతలు(Airport Assistant Jobs 2023 Eligibility Details)
పోస్ట్ పేరు | అర్హతలు |
జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) | 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా (మెకానికల్/ ఆటోమొబైల్/ ఫైర్), HMV, LMV లైసెన్సు |
జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్) | ఏదైనా డిగ్రీ |
సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్) | డిప్లొమా(ఎలక్ట్రానిక్స్, టెలికమ్యునికేషన్/ రేడియో ఇంజినీరింగ్) |
సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) | ఏదైనా డిగ్రీ |
వయో పరిమితి (Airport Assistant Jobs 2023 Age Limit)
- కనిష్ఠ వయసు- 18 ఏళ్లు
- గరిష్ఠ వయసు- 30 ఏళ్లు
- నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
అప్లికేషన్ ఫీజు(Airport Assistant Jobs 2023 Application Fees)
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్- సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.
- మిగతా కేటగరీలకు చెందిన అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.