Airplane Tire Explosion: బెంగళూరు దేవనహళ్లిలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెనుప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్ అవుతుండగా.. వెనుక టైరు పేలిపోయింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు అధికారులు స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు.
థాయ్ ఎయిర్వేస్కు చెందిన విమానం బ్యాంకాక్ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టైరు పేలడం గమనించిన విమానాశ్రయ అధికారులు.. పైలట్‌ను అప్రమత్తం చేశారు. దీంతో విమానం సేఫ్‌గా ల్యాండ్ అయింది. అనంతరం.. విమానాన్ని సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.