తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశీయ విమాన సర్వీసులు పెంచుతూ కేంద్రం నిర్ణయం - domestic airlines news india

దేశీయంగా తిరిగే విమానాల సంఖ్యను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిడ్​ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఇదివరకు ప్రభుత్వం.. విమాన సేవలపై ఆంక్షలు విధించింది.

Airlines allowed to deploy up to 80% capacity in domestic sector
దేశీయ విమాన సర్వీసులు పెంచుతూ కేంద్రం నిర్ణయం

By

Published : Dec 3, 2020, 9:16 PM IST

దేశీయంగా తిరిగే విమాన సర్వీసుల సంఖ్యను పెంచుతున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్​ సింగ్​ పురి వెల్లడించారు. ఇప్పటివరకు 70శాతంగా తిరుగుతున్న విమానాలను 80శాతంకు పెంచుతున్నట్లు తెలిపారు. అయితే ఈ ఏడాది మే నేలలో 30 వేలమంది ప్రయాణికులతో ప్రారంభమైన దేశీయ కార్యకలాపాలు నవంబర్​ 30 నాటికి 2.52 లక్షల గరిష్ఠాన్ని తాకినట్లు పేర్కొన్నారు.

గత నెల దేశీయంగా విమానాలు నడిపేందుకు ఆయా సంస్థలకు కేవలం 70 శాతం వరకు మాత్రమే కేంద్రం అనుమతించింది. తాజా నిర్ణయంతో సర్వీసుల సంఖ్య పెరగనుంది. కరోనా లాక్​డౌన్​ కారణంగా మార్చి​ 25 నుంచి దేశీయ సర్వీసులపై ఆంక్షలు విధించింది.

ఇదీ చూడండి: పండుగల వేళ విమాన సర్వీసులు పెంపు!

ABOUT THE AUTHOR

...view details