అహ్మదాబాద్-చెన్నై మధ్య తిరిగే ఎయిర్ ఏషియా ఇండియా, బెంగళూరు-వడోదర మధ్య తిరిగే ఇండిగో విమానాలు జనవరి 29వ తేదీన ముంబయి గగనతలంలో 8 కిమీ దూరంలో ప్రయాణించినట్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ బ్యూరో తెలిపింది. అంతేకాకుండా కేవలం 300 అడుగుల వర్టికల్ సపరేషన్లో ఎగిరినట్లు పేర్కొంది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్.. పరిస్థితులపై అవగాహన లేకపోవడం వల్ల ఇలా జరిగిందని ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అంతేగాకుండా ముంబయి ఎయిర్పోర్ట్ కంట్రోలర్ పరిస్థితిని ముందస్తుగా అంచనా వేయడంలో విఫలం అయినట్లు తెలిపింది.
ఇదీ జరిగింది..
సాధారణంగా అహ్మదాబాద్ నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చే విమానాలు చాలా వరకు భావ్నగర్ మీదుగానే రావాల్సి ఉంటుంది. జనవరి 29న ఎయిర్ ఏషియా విమానం ముంబయిలో ఎప్పటిలానే దిగాలనుకుంది. అయితే ఈ ప్లేన్కు వ్యతిరేక దిశలో ఇండిగో విమానం వచ్చింది. ఇవి రెండు వివిధ ఎత్తుల్లో పరస్పరం సమాంతరంగా ప్రయాణించాయి. ఆ సమయంలో ఆ రెండు విమానాలు ఢీ కొట్టుకునే అవకాశం ఉందని గుర్తించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్.. ఇందుకు సంబంధించిన హెచ్చరికలు జారీ చేసింది. అయితే దానికి ఇరువురు నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేదని నివేదికలో పేర్కొంది.
ఇదీ చూడండి:Afghan News: అఫ్గాన్ నుంచి భారత్ చేరుకున్న మరో 78 మంది