వాయు కాలుష్యంతో కరోనా తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల సమస్య, ఆస్తమా ఉన్నవారికి శ్వాసకోశ సమస్యలు తీవ్రమవుతాయని చెప్పారు. దీపావళి కారణంగా దిల్లీలో శుక్రవారం రికార్డ్ స్థాయిలో వాయు కాలుష్యం నమోదైన నేపథ్యంలో ఈ మేరకు స్పందించారు.
"అక్టోబర్, నవంబర్ మాసాల్లో గాలి వేగం తక్కువగా ఉంటున్నందున టపాసుల ద్వారా వచ్చిన పొగ భూమి పై పొరల్లోనే ఉండి కాలుష్యానికి కారణమవుతుంది. కాలుష్యం ఎక్కువగా ఉన్న గాలిలో కరోనా వైరస్ ఎక్కువ కాలం ఉండగలదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇందువల్ల కరోనా మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది."