భారత వైమానిక దళాధిపతి (Chief of Air Staff) ఎయిర్‌చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆయన స్థానంలో ఎయిర్‌మార్షల్ వివేక్ రామ్ చౌధరిని (Air Marshal VR Chaudhari) నియమించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రక్షణ శాఖ.. కేంద్ర ప్రభుత్వానికి వెల్లడించింది.
ఎయిర్‌మార్షల్ భదౌరియా పదవీకాలం ఈ సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఆ తర్వాత ఎయిర్‌మార్షల్ వీఆర్ చౌధరి బాధ్యతలు చేపట్టనున్నారు. ఎయిర్‌మార్షల్ చౌధరీ ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్ వైస్ చీఫ్‌గా సేవలందిస్తున్నారు.