తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గాల్లో ఎయిర్ ​ఇండియా ఎక్స్​ప్రెస్​ విమానం.. ఇంజిన్​లో మంటలు.. ప్రయాణికులంతా.. - DGCA

అబుదబీ నుంచి భారత్​కు వస్తున్న ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్​ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గగనతలంలో విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగడం వల్ల పైలట్‌ అప్రమత్తమై సురక్షితంగా దించేశారు.

దుబాయ్​ నుంచి ఇండియా నుంచి వస్తున్న విమానంలో మంటలు
దుబాయ్​ నుంచి ఇండియా నుంచి వస్తున్న విమానంలో మంటలు

By

Published : Feb 3, 2023, 9:43 AM IST

Updated : Feb 3, 2023, 11:51 AM IST

అబుదబీ నుంచి భారత్‌కు వస్తున్న ఓ ఎయిర్​ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో గాల్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్‌ చేశారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
శుక్రవారం ఉదయం అబుదబీ నుంచి ఎయిర్​ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం కాలికట్‌ (కోజికోడ్‌) బయల్దేరింది. అయితే టేకాఫ్‌ అయి విమానం 1000 అడుగుల ఎత్తులో ఉండగా ఒక ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడి మంటలు చెలరేగాయి. దీన్ని గుర్తించి పైలట్‌ వెంటనే విమానాన్ని అబుదబీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఘటన సమయంలో విమానంలో 184 మంది ప్రయాణికులున్నారు. వారంతా సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్​ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ అధికారులు తెలిపారు.

ఇటీవల ఎయిర్​ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మరో విమానంలోనూ సాంకేతిక సమస్య ఏర్పడింది. గత నెల 23న తిరువనంతపురం నుంచి మస్కట్‌ బయల్దేరిన విమానంలో 45 నిమిషాల తర్వాత సాంకేతిక లోపం కారణంగా వెనక్కి మళ్లింది.

Last Updated : Feb 3, 2023, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details