ఎయిర్ ఇండియా పాత విమానం (Air India Aircraft) ఒకటి జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో వంతెన కింద ఇరుక్కుంది(Aircraft stuck under bridge). శనివారం రహదారి మార్గంలో దీనిని తరలిస్తుండగా ఘటన సంభవించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో ఆదివారం సామాజిక అనుసంధాన వేదికల్లో చక్కర్లు (Aircraft Viral video) కొట్టింది.
Viaral Video: వంతెన కింద ఇరుక్కున్న విమానం - వంతెన కింద విమానం
ఎయిర్ ఇండియాకు చెందిన ఓ పాత విమానం (Air India Aircraft) జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్) పరిధిలోని ఓ వంతెన కింద (Aircraft stuck under bridge) ఇరుక్కుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.

వంతెన కింద ఇరుక్కున్న విమానం
ఈ విషయమై ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ... వంతెన కింద ఇరుక్కున్న విమానాన్ని ఎయిర్ ఇండియా సేవల నుంచి గతంలోనే తొలగించామని, తుక్కు కింద విక్రయించామని తెలిపారు. 'విమానాన్ని కొనుక్కున్న వారు శనివారం దానిని తరలిస్తున్నారు. ఎయిర్ ఇండియాకు విమానంతో ఎలాంటి సంబంధం లేదు' అని స్పష్టం చేశారు.