కర్ణాటకలో ఘోరం జరిగింది. తన ప్రియుడిని కలిసేందుకు దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఓ ఎయిర్ హోస్టెస్ అపార్ట్మెంట్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
6 నెలలుగా ప్రేమలో..
మంగళూరుకు చెందిన ఆదేశ్ వృత్తిరీత్యా బెంగళూరులో నివాసముంటున్నాడు. మృతురాలు అర్చన(28) స్వస్థలం హిమాచల్ ప్రదేశ్. కాగా, ఇద్దరూ గత ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రియుడు ఆదేశ్‌ను కలవడానికి అర్చన శుక్రవారం దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చింది. కోరమంగళ ప్రాంతంలోని రేణుకా రెసిడెన్సీ భవనంలో ఇద్దరు శనివారం అర్ధరాత్రి గొడవ పడ్డారు. అనంతరం అర్చన భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. అయితే యువతి ఓ ప్రముఖ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తుండగా.. ఆదేశ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అపార్ట్మెంట్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని.. మృతదేహాన్ని సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించినట్లు సౌత్ ఈస్ట్ డివిజన్ డీసీపీ సీకే బాబు తెలిపారు.
భవనంపై నుంచి ఇనుప రాడ్డు పడి..
మహారాష్ట్రలో ఓ భవన యజమాని నిర్లక్ష్యం కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌పై నుంచి ఇనుప రాడ్ పడడం వల్ల ఆటోలో వెళ్తున్న తల్లీకూతురు మరణించారు.
ఇనుప రాడ్డు పడిన ఆటో.. తల్లి, కుమార్తె మృతి నెల కూడా కాకముందే..
శనివారం సాయంత్రం ముంబయిలోని సబ్అర్బన్ జోగేశ్వరి ప్రాంతంలో ఓ మహిళ, ఆమె కుమార్తె ఆటోలో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే నిర్మాణంలో ఉన్న 14 అంతస్తుల భవనంలోని 7వ అంతస్తుపై నుంచి ఇనుప రాడ్ పడింది. అది కాస్త ఆటోలో వెళ్తున్న తల్లీకూతురి పడడం వల్ల తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనదారుడు అంబులెన్స్‌కి సమాచారం ఇవ్వడం వల్ల మొదట వారిని సమీపంలోని ట్రామా కేర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మహిళ చనిపోయిందని వైద్యులు చెప్పారు. అనంతరం కుమార్తెకు మెరుగైన చికిత్స కోసం అంథేరీలోని కోకిలాబెన్ ఆసుపత్రికి పంపించారు. అక్కడికి వెళ్లే సరికి బాలిక కూడా మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. కాగా, చనిపోయిన మహిళ షామా బానో ఆసిఫ్ షేక్(28), అయత్ ఆసిఫ్ షేక్(9)గా గుర్తించారు అధికారులు.
గత నెల 14న కూడా ఈ తరహా ఘటనే సెంట్రల్ ముంబయిలోని వర్లీ ప్రాంతంలో వెలుగుచూసింది. ఈ ఘటనలో నిర్మాణంలో ఉన్న భవనంలోని 52వ అంతస్తు నుంచి కింద నిలబడి ఉన్న ఇద్దరు వ్యక్తులపై సిమెంట్ దిమ్మె పడటం వల్ల ఇద్దరు చనిపోయారు. కాగా, ఈ వరుస ఘటనలపై బాంబే హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
నిప్పంటుకుని ఒకే కుటుంబంలో ఐదుగురు..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గుడిసెకు నిప్పంటుకుని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అగ్నికి ఆహుతయ్యారు. భార్యభర్తలు సహా ముగ్గురు మరణించగా.. మరో నవజాత శిశువు, ఓ వృద్ధుడు ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల జిల్లా ఆస్పత్రికి తరలించామని.. గుడిసెకి మంటలు అంటుకోవడానికి షాట్ సర్క్యూటే కారణమని పోలీసులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: