తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుప్పకూలిన ఎయిర్​ఫోర్స్ విమానం.. గాల్లోకి ఎగిరిన క్షణాల్లోనే..! - UAV Crash in Jaisalmer

UAV Crash in Jaisalmer: రాజస్థాన్​ జైసల్మేర్​లో సైన్యానికి చెెందిన మానవ రహిత విమానం కుప్పకూలింది. విమానంలో సాంకేతిక సమస్య కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Aircraft
విమానం

By

Published : Apr 4, 2022, 11:02 PM IST

UAV Crash in Jaisalmer: రాజస్థాన్​ జైసల్మేర్​లో మానవ రహిత విమానం ప్రమాదానికి గురైంది. గాల్లోకి ఎగిరిన విమానం అకస్మాత్తుగా నేలపై కూలిపోయింది. జైసల్మేర్​లోని షాహీద్​ సగర్మల్​ గోపా కాలనీకి సమీపంలో ఈ ఘటన జరిగింది. అయితే.. ఆ కాలనీల్లో ఎవరూ నివసించట్లేదు. దీంతో ప్రమాదం తప్పింది. ఎవరికీ ఏ గాయాలు కాలేదు.

రిమోట్ ఆధారంగా పనిచేసే మానవ రహిత విమానం(యూఏవీ).. డ్రోన్​ కంటే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. ఈ నిఘా విమానం ద్వారా పరిసర ప్రాంతాల్లో ఎయిర్​ఫోర్స్ నిఘా పెడుతుంది. విమానంలో సాంకేతిక సమస్య కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:శ్రీనగర్​లో కశ్మీర్ పండిట్​పై ముష్కరుల కాల్పులు

ABOUT THE AUTHOR

...view details