తెలంగాణ

telangana

ETV Bharat / bharat

New IAF chief of India: వైమానిక దళాధిపతిగా వీఆర్ చౌదరి

భారత వాయుసేన దళాధిపతిగా (New IAF chief of India) ఎయిర్​చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి బాధ్యతలు చేపట్టారు. గురువారం పదవీ విరమణ చేసిన ఎయిర్​చీఫ్ మార్షల్ ఆర్​కేఎస్ భదౌరియా (RKS Bhadauria) స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. (IAF Chief)

IAF CHAUDHARI
చౌధరి

By

Published : Sep 30, 2021, 3:18 PM IST

భారత వాయుసేన దళాధిపతిగా (New IAF chief of India) ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి (VR Chaudhari) బాధ్యతలు స్వీకరించారు. ఎయిర్​చీఫ్ మార్షల్ ఆర్​కేఎస్ భదౌరియా పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో (IAF Chief) చౌదరి బాధ్యతలు చేపట్టారు.

వీఆర్ చౌదరి బాధ్యతల స్వీకరణ

రక్షణ పరంగా దేశ సరిహద్దులో అనిశ్చిత పరిస్థితులు ఉన్న ప్రస్తుత సమయంలో వాయుసేనను చౌదరి నడిపించనున్నారు. చైనాతో ఓవైపు సరిహద్దు వివాదం, అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల ఆక్రమణ సహా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ విసిరే ఉగ్రసవాళ్లను ఎదుర్కోవడం ఆయనకు కీలకం కానున్నాయి. దీంతోపాటే, రక్షణ రంగంలో కీలకమైన ఒప్పందాలను చౌదరి ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. రష్యా నుంచి ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ త్వరలోనే దేశానికి చేరుకోనుంది. దీన్ని కార్యాచరణలోకి తీసుకురావాల్సిన బాధ్యత చౌదరిపై ఉండనుంది. దీంతోపాటు వాయుసేనలో మరిన్ని అధునాతన యుద్ధ విమానాలు చేర్చుకోవడంపైనా ఆయన దృష్టిసారించాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.

చౌదరి నేపథ్యం

1982 డిసెంబర్​లో భారత వాయుసేనలో చేరారు చౌదరి. (VR Chaudhari biography) మొత్తం 3800 గంటల పాటు విమానాలు నడిపిన అనుభవం ఆయన సొంతం. ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ సఫేద్ సాగర్​లో కీలకంగా వ్యవహరించారు. ఆయన నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీస్‌ స్టాఫ్‌ కళాశాల పూర్వవిద్యార్థి కూడా.

చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన సమయంలో అక్కడికి సమీపంలోని లద్దాఖ్ సెక్టార్​ ఇంఛార్జిగా వ్యవహరించారు చౌదరి. ఎయిర్​ఫోర్స్ ప్రధాన కార్యాలయంతో పాటు క్షేత్రస్థాయిలోనూ ముఖ్యమైన విధులు నిర్వర్తించారు. ఎయిర్​ఫోర్స్ వైస్ చీఫ్​గా బాధ్యతలు స్వీకరించటానికి ముందు పశ్చిమ ఎయిర్‌ కమాండ్‌కు అధిపతిగా విధులు నిర్వహించారు. ఈ సమయంలో అంబాలా ఎయిర్​బేస్​లో రఫేల్ స్క్వాడ్రన్ ఏర్పాటు చేశారు. కాగా, చౌదరి కుమారుడు రఫేల్ పైలట్ కావడం విశేషం.

42 ఏళ్ల సేవలకు విరామం

మరోవైపు, పదవీ విరమణ చేసిన భదౌరియా (RKS Bhadauria) చివరిసారిగా సెప్టెంబర్ 13న యుద్ధవిమానాన్ని నడిపినట్లు భారత వాయుసేన తెలిపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది.

42 ఏళ్ల పాటు వాయుసేనలో సేవలందించారు భదౌరియా. రెండు అతిపెద్ద ఒప్పందాలు కుదరడంలో కీలకంగా వ్యవహరించారు. 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు సహా 83 మార్క్1ఏ దేశీయ తేజస్ జెట్​లను సమకూర్చే దిశగా ప్రయత్నాలు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details