దేశవ్యాప్తంగా, విదేశాలలోనూ కొవిడ్ సహాయ చర్యలు వేగంగా చేపట్టేందుకు 24x7 సిద్ధంగా ఉన్నామని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) పేర్కొంది. ఇందుకోసం హెవీ-లిఫ్ట్, మీడియం-లిఫ్ట్ విమానాలను మోహరించామని తెలిపింది. ఈ మేరకు కరోనాపై పోరులో చేస్తున్న ప్రయత్నాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఐఏఎప్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా వివరించారు.
వివిధ మంత్రిత్వ శాఖలతో సమన్వయం కోసం ఐఏఎఫ్ ఏర్పాటు చేసిన కొవిడ్ ఎయిర్ సపోర్టు సెల్‌పై మోదీకి భదౌరియా వివరించారు. 24 గంటల పాటు సేవలందించేందుకు ఐఏఎఫ్‌లో సిబ్బంది సంఖ్యను పెంచామని తెలిపారు. ఐఏఎఫ్ ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో కొవిడ్ రోగులకు చికిత్స అందించేలా సదుపాయాలు కల్పించామని.. పౌరులను కూడా చికిత్సకు అనుమతిస్తున్నామని చెప్పారు.