బిహార్ శాసనసభ ఎన్నికల్లో అఖిల భారత మజ్లిస్ ఎ ఇత్తెహదుల్ ముస్లిమీన్(ఎంఐఎం) పార్టీ అరుదైన విజయం సాధించింది. అనూహ్యంగా ఐదు స్థానాలు కైవసం చేసుకుంది. అమౌర్, కొచాధమన్, జోకిహాట్, బైసీ, బహదుర్గంజ్ నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
2019 ఉప ఎన్నికల్లో కిషన్గంజ్ అసెంబ్లీ స్థానం గెలుచుకోవటం మినహా బిహార్లో ఓవైసీ పార్టీ సాధించిన గొప్ప విజయాలేవీ లేవు. తాజా విజయంతో బిహార్లో పార్టీ ప్రభావం పెరుగుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఇరుకూటముల మధ్య ఆధిక్యం దోబూచులాడుతున్న నేపథ్యంలో ఎంఐఎం పార్టీ 'కింగ్ మేకర్'గా అవతరించే అవకాశమూ లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.