AIMIM UP Election 2022: ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో భాజపా గాలికి ఎస్పీ, కాంగ్రెస్, మజ్లిస్ సహా ఇతర పార్టీలు ఘోర పరాజయాన్ని చవిచూశాయి. కాంగ్రెస్ రెండు స్థానాలకే పరిమితం కాగా.. ముస్లిం ఓటర్లను ఆకర్షించి యూపీలో పాగా వేయాలనుకున్న ఏఐఎంఐఎంకు ఎదురుబెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున బరిలో ఏ ఒక్క అభ్యర్థి కూడా 5వేల ఓట్ల మార్కును దాటలేదు. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో నమోదైన ఓట్లలో మజ్లిస్‌కు దక్కిన వాటా 0.43 శాతం మాత్రమే.
అజాంగఢ్ సహా పలు ప్రధాన నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులకు చాలా తక్కువ ఓట్లే దక్కాయి. సాయంత్రం 4 గంటల సమయానికి అజాంగఢ్ అభ్యర్థి కమార్ కమల్‌కు 1368 ఓట్లు, దియోబాంద్ అభ్యర్థి ఉమైర్ మద్నికి 3145 ఓట్లు, జాన్పుర్ అభ్యర్థి అభయ్రాజ్కు 1340 ఓట్లు, కాన్పుర్ కంటోన్మెంట్ అభ్యర్థి మోయినుద్దీన్‌కు 754 ఓట్లు దక్కాయి.
మరోవైపు లఖ్‌నవూ సెంట్రల్ అభ్యర్థి సల్మాన్‌కు 463, మేరఠ్ అభ్యర్థి ఇమ్రాన్ అహ్మద్ 2405, ముజఫర్‌నగర్‌కు చెందిన మహమ్మద్ ఇన్తెజార్కు 2642 ఓట్లు మాత్రమే పడ్డాయి.
ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తాం
ఎంఐఎం ఓటమిపై ఆ పార్టీ అధినేత ఒవైసీ స్పందించారు. యూపీ ప్రజలు మరోసారి భాజపాకు పట్టం కట్టారని.. వారి నిర్ణయాన్ని గౌరవిస్తామని పేర్కొన్నారు.