బిహార్ ఎన్నికల్లో రాణించిన తర్వాత ఆల్ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ జోరు పెంచింది. ఉత్తర్ప్రదేశ్లో 2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లలో పోటీచేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్ధీన్ ఒవైసీ ప్రకటించారు. షెడ్యూల్డ్ భారతీయ సమాజ్ వాదీ (ఎస్బీఎస్పీ), చిన్న పార్టీల కూటమైన భాగీదార్ సంకల్ప్ మోర్చాతో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
"ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో 100 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాం. అప్లికేషన్ ఫాంలను కూడా రిలీజ్ చేశాం."
-అసదుద్ధీన్ ఓవైసీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు