తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పట్టపగలు ఇంటి ముందే ఎంఐఎం కౌన్సిలర్​ హత్య - మేరఠ్ న్యూస్

ఎంఐఎం కౌన్సిలర్​ను అతని ఇంటిముందే కాల్చి చంపారు దుండుగులు. బైక్​పై వచ్చి బుల్లెట్ల వర్షం కురిపించి పరారయ్యారు.

AIMIM councillor shot dead in UP's Meerut
ఎంఐఎం కౌన్సిలర్​ను ఇంటి ముందే కాల్చి చంపిన దుండగులు

By

Published : Aug 29, 2021, 11:58 AM IST

ఎంఐఎం కౌన్సిలర్​ను పట్టపగలే కాల్చి చంపారు దుండుగులు. బైక్​పై వచ్చిన ఇంటి ముందు కారులో కూర్చున్న అతనిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఉత్తర్​ప్రదేశ్ మేరఠ్​లో శనివారం ఈ ఘటన జరిగింది. ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఎంఐఎం కౌన్సిలర్ పేరు​ జుబేర్​(40). మేరఠ్ 80వ వార్డు కౌన్సిలర్.​ నౌచండీ పోలీస్​ స్టేషన్ పరిధిలోని ధాబాయ్​ నగర్​లో నివాసముంటున్నాడు. ఘటన అనంతరం కుటుంబ సభ్యులు జుబేర్​ను ఆస్పత్రికి తరలించగా.. అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

ఇదీ చూడండి:అసెంబ్లీ వేదికగా పార్టీ నేతలకు సీఎం హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details