తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'2024 నాటికి 60వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం' - నితిన్​ గడ్కరీ

దేశంలో 60వేల కిలోమీటర్ల మేర ప్రపంచ స్థాయి జాతీయ రహదారుల నిర్మాణమే తమ లక్ష్యమని కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ వెల్లడించారు. రోజుకు 40 కిలోమీటర్ల చొప్పున రోడ్లను నిర్మించాలని తలపెట్టినట్టు స్పష్టం చేశారు.

roads in India
భారత రోడ్లు

By

Published : Jul 10, 2021, 12:48 PM IST

Updated : Jul 13, 2021, 4:40 PM IST

రోజుకు 40 కిలోమీటర్ల చొప్పున.. 2024 నాటికి 60వేల కిలోమీటర్ల ప్రపంచ స్థాయి జాతీయ రహదారులను నిర్మించడమే తమ లక్ష్యమని కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ వెల్లడించారు. 'భారత్​లో రోడ్ల అభివృద్ధి'పై ఏర్పాటు చేసిన 16వ వార్షిక సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు.

"ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్డు నెట్​వర్క్​(63లక్షల కిలోమీటర్లు) భారత్​లో ఉంది. భారత ఆర్థికాభివృద్ధిలో రోడ్లు, మౌలికవసతులు కీలక పాత్ర పోషిస్తాయి. నేషనల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ పైప్​లైన్​ పేరుతో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం 1.4ట్రిలియన్​ డాలర్లు(రూ. 111 లక్షల కోట్లు) పెట్టుబడి పెడుతోంది."

- నితిన్​ గడ్కరీ, రోడ్డు రవాణాశాఖ మంత్రి.

మౌలికవసతుల అభివృద్ధికి ప్రభుత్వం వెచ్చిస్తున్న ఖర్చును ఏడాదిలో 34శాతం పెంచినట్లు స్పష్టం చేశారు నితిన్​.

ఇదీ చూడండి:-రహదారుల నిర్మాణంలో సవాళ్లెన్నో!

Last Updated : Jul 13, 2021, 4:40 PM IST

ABOUT THE AUTHOR

...view details