తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సినీ హీరో ఔదార్యం- ఐదు ప్రాణాలు సేఫ్ - ఒకే కాన్పులో నలుగురు పిల్లలు

గర్భిణీ దయనీయ పరిస్థితి చూసి చలించిపోయారు ఆ నటుడు. చికిత్సకు నోచుకోని పేదరికంలో కూరుకుపోయిన మహిళకు.. అంబులెన్సు ఏర్పాటు చేశారు. ఫలితంగా.. నలుగురు పండంటి బిడ్డలకు మహిళ జన్మనిచ్చింది. ఆ హీరోపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

woman gives birth to quadruplets
సినీ హీరో ఔదార్యం- ఐదు ప్రాణాలు సేఫ్

By

Published : Aug 9, 2021, 4:03 PM IST

ఒరియా నటుడు సవ్యసాచి మిశ్రా సకాలంలో చేసిన సాయం ఐదు ప్రాణాలను కాపాడింది. పేదరికంలో మునిగిపోయిన ఓ మహిళకు కొత్త జీవితం లభించింది. ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు ఆ మహిళ జన్మనిచ్చింది. మానవతా దృక్ఫథంతో మిశ్రా చేసిన సాయంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

చిన్నారులు

అసలేం జరిగిందంటే..?

భంజనగర్​లోని సారాంకుల్​కు చెందిన చాబీ అనే మహిళ గర్భంలో నలుగురు శిశువులు పెరుగుతున్నట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స కూడా చేయించుకునే స్థితిలో లేని మహిళ గురించి తెలుసుకున్న నటుడు మిశ్రా.. గర్భిణీ కోసం ప్రత్యేక అంబులెన్సును ఏర్పాటు చేశారు. కటక్​లోని ఎస్​సీబీ బోధనాసుపత్రికి ఆమెను తరలించే ఏర్పాట్లు చేశారు.

ఆస్పత్రిలో వైద్యులు

ఆస్పత్రిలో మహిళకు పరీక్షలు నిర్వహించగా.. సికిల్ సెల్, తీవ్రమైన జాండిస్, అనీమియా వ్యాధులు ఉన్నట్లు తేలింది. దీంతో గైనకాలజీ, హెమటాలజీ, హెపటాలజీ విభాగానికి చెందిన వైద్యులు.. మహిళకు ప్రత్యేక పద్ధతిలో చికిత్స చేశారు. తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడేందుకు వినూత్న పద్ధతిని అనుసరించారు. సర్జరీ కాకుండా.. సాధారణ ప్రసవం జరిగేలా చూశారు.

మహిళకు నలుగురు ఆడపిల్లలు జన్మించగా.. వీరందరి ఆరోగ్యం క్షేమంగానే ఉన్నట్లు మిశ్రా తెలిపారు. మహిళ సైతం చికిత్సకు స్పందిస్తోందని వివరించారు.

ఇదీ చదవండి:ఒలింపిక్​ వీరులకు పార్లమెంట్​లో హర్షధ్వానాలు

ABOUT THE AUTHOR

...view details