తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్రెయిన్ సర్జరీ చేస్తుంటే.. హనుమాన్​ చాలీసా పారాయణం - Delhi aiims brain surgery

ఓవైపు మెదడులోని కణతిని తొలగించే ప్రక్రియలో వైద్యులు నిమగ్నమైతే.. మరోవైపు హనుమాన్​ చాలీసా చదువుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు ఓ మహిళ. శస్త్ర చికిత్స పూర్తవగానే ఏమీ జరగనట్లు తల రద్దుకుంటూ.. అటు ఇటు తిప్పుతూ.. ఆపరేషన్​ థియేటర్​ నుంచి బయటకు వచ్చారు.

Delhi aiims
దిల్లీ ఎయిమ్స్​

By

Published : Jul 23, 2021, 8:52 PM IST

Updated : Jul 23, 2021, 10:05 PM IST

దిల్లీ ఎయిమ్స్​

శస్త్రచికిత్స ద్వారా మెదడులో కణతిని తొలగిస్తుండగా.. తనకేమీ జరగనట్లు హనుమాన్​ చాలీసా పారాయణ చేసుకున్నారు ఓ మహిళ. కాగా ఆమె మధ్యలో తప్పు పలికితే ఆపరేషన్​ చేస్తున్న వైద్యుడొకరు సహకరించారు. ఇదంతా దిల్లీ ఎయిమ్స్​ ఆసుపత్రిలో జరిగింది.

'క్రేనియోటమీ' శస్త్రచికిత్స విధానం ద్వారా ఆమెకు కేవలం కణతి ఉన్న ప్రాంతంలోనే మత్తు ఇచ్చి ఆపరేషన్​ చేశామని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స విజయవంతమైందని వెల్లడించారు.

ఏమీ జరగనట్లు బయటకు వచ్చి..

ఆమె మెదడుకు ఎడమ వైపున కణతిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించారు. అనంతరం ఆమెకు ఏమీ కానట్లు తల.. అటూ ఇటూ ఊపుతూ ఆపరేషన్​ థియేటర్​ నుంచి బయటకు వచ్చారు. ఈ ఆపరేషన్​కు సంబంధించిన దృశ్యాలను అక్కడున్న వైద్య సిబ్బంది ఒకరు ఫోన్​ రికార్డు చేసి.. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో వైరల్​గా మారింది.

గతంలో మధ్యప్రదేశ్​ బిర్లా ఆసుపత్రి వైద్యులు.. ఓ బాలికకు ఇలాంటి శస్త్రచికిత్స చేయగా.. ఆ చిన్నారి పియానో వాయిస్తూ, వైద్యులతో ముచ్చటిస్తూ అందరినీ అబ్బురపరిచింది.

ఇదీ చూడండి:భారత్​లో 49 లక్షల కొవిడ్​ మరణాలు.. నిజమేనా?

Last Updated : Jul 23, 2021, 10:05 PM IST

ABOUT THE AUTHOR

...view details