దేశంలో టీకా పంపిణీని వేగవంతం చేయడానికి ఒక విధానం అవసరమని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. "ఒక్క రోజులోనో, రెండు రోజుల్లోనో లేక ఒక నెలలోనో అందరికీ టీకా వేయడం సాధ్యం కాదు. కాబట్టి యువకులకు రెండు, మూడు నెలల ముందుగా టీకా కోసం నమోదు చేసుకోమని గడువిచ్చి ఆ తర్వాత వ్యాక్సిన్ వేయాలి. ఎక్కవగా కేసులు, మరణాలు వృద్ధులలో, ఇతరేతర రోగాలు ఉన్నవారిలో నమోదవుతున్నాయి కాబట్టి వారికి మొదట టీకాలు వేయాలి" అని తెలిపారు.
'టీకా పంపిణీకి ఒక విధానం అవసరం' - కొవిడ్ -19 వ్యాక్సిన్లు
దేశంలో టీకా పంపిణీని వేగవంతం చేయడానికి ఒక విధానాన్ని రూపొందించాలని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. రెండు నెలల వ్యవధిలో కొవిడ్ -19 వ్యాక్సిన్లు పెద్ద మొత్తంలో లభిస్తాయని చెప్పారు.
మరో రెండు నెలల్లో పెద్ద ఎత్తున టీకాలు అందుబాటులోకి రాబోతున్నాయని వెల్లడించారు. వివిధ కంపెనీలు టీకా తయారీని మొదలు పెట్టబోతున్నాయని తెలిపారు. దానితో పాటు విదేశాల నుంచి కూడా టీకాలు వచ్చే అవకాశం ఉందన్నారు. కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ టీకాలను ఇండియాలో కొత్త కంపెనీలు కూడా తయారు చేయబోతున్నాయని తెలిపారు. భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొత్త ప్లాంట్లను నెలకొల్పబోతున్నాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వి మధ్య తేడా ఏంటి?