AIIMS Bhopal Recruitment 2023 :ఆల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) పలు ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైంది. అటెండెంట్, క్యాషియర్ ఇతర ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను భోపాల్ ఎయిమ్స్ విడుదల చేసింది. మొత్తం 357 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఖాళీల వివరాలు..
AIIMS Bhopal Recruitment 2023 Vacancy Details
- మొత్తం పోస్టులు - 357
- హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్ 3 - 106
- ల్యాంబ్ అటెండెంట్ గ్రేడ్ 2 - 41
- మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ - 38
- ఫార్మసిస్ట్ గ్రేడ్ 3 - 27
- వైర్‌మ్యాన్ - 20
- శానిటరీ ఇన్‌స్పెక్టర్ - 18
- ప్లంబర్ - 15
- ఆర్టిస్ట్(మోడలర్) - 14
- క్యాషియర్ - 13
- ఆపరేటర్(E&M)/ లిఫ్ట్ ఆపరేటర్ - 12
- జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్ - 5
- మానిఫోల్డ్ టెక్నీషియన్ - 6
- ఎలక్ట్రీషియన్ - 6
విద్యార్హతలు..
AIIMS Bhopal Recruitment 2023 Eligibility Criteria :పోస్టును బట్టి విద్యార్హతలు ఉన్నాయి. కొన్ని పోస్టులకు 10వ తరగతి, మరికొన్ని పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలని భోపాల్ ఎయిమ్స్ పేర్కొంది. ఇంకొన్ని పోస్టులకు బీఎస్సీ, కామర్స్ చదివి ఉండాలని తెలిపింది. కాగా కొన్నింటికి అనుభవం కూడా అవసరమని వెల్లడించింది.
వయస్సు :
పోస్టు ఆధారంగా 21-40 ఏళ్ల మధ్యలో ఉండాలని ఎయిమ్స్ ఉద్యోగ ప్రకటనలో తెలిపింది.
పరీక్ష విధానం..
AIIMS Bhopal Recruitment 2023 Exam Pattern
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది.
- రెండు భాగాలుగా ఈ టెస్ట్ ఉంటుంది.
- పార్ట్ ఏకు 25 మార్కులు, పార్ట్ బీ 75 మార్కులు ఉంటాయి.