AIATSL Job News Today : పదో తరగతి చదువుకుని ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులందరికీ శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా ఆధ్వర్యంలోని.. 'ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్' (AIASL) 998 హ్యాండీమ్యాన్, ఏజెంట్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 18లోపు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- హ్యాండీమ్యాన్ - 971 పోస్టులు
- యుటిలిటీ ఏజెంట్ (మేల్స్) - 20 పోస్టులు
- యుటిలిటీ ఏజెంట్ (ఫిమేల్స్) - 07 పోస్టులు
విద్యార్హతలు
AIATSL Jobs Qualifications :
- హ్యాండీమ్యాన్ పోస్టులు :అభ్యర్థులు ఎస్ఎస్సీ/10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అయితే కచ్చితంగా ఇంగ్లీష్ చదవగలగాలి, అర్థం చేసుకోగలగాలి. హిందీ, స్థానిక భాషలు వచ్చినవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- యుటిలిటీ ఏజెంట్ పోస్టులు : అభ్యర్థులు 10వ తరగతి క్వాలిఫై అయ్యుండాలి. ఆంగ్లం అర్థం చేసుకోగలగాలి. హిందీ, అలాగే స్థానిక భాషలు తెలిసి ఉండాలి.
వయోపరిమితి
AIATSL Jobs Age Limit :హ్యాండీమ్యాన్, యుటిలిటీ ఏజెంట్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి.. జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లు; ఓబీసీ అభ్యర్థులకు 31 ఏళ్లు; ఎస్సీ/ఎస్టీలకు 33 ఏళ్లు ఉంటుంది.