AIASL Recruitment 2023 : ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) 828 కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్, మేనేజర్స్ సహా, ఇతర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఒప్పంద ప్రాతిపదికన పనిచేయాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 217 పోస్టులు
- సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 178 పోస్టులు
- ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 138 పోస్టులు
- యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ - 167 పోస్టులు
- డిప్యూటీ మేనేజర్ ర్యాంప్/ మెయింటెనెన్స్ -7 పోస్టులు
- డిప్యూటీ మేనేజర్ ర్యాంప్ - 28 పోస్టులు
- జూనియర్ ఆఫీసర్ టెక్నికల్ - 24 పోస్టులు
- డిప్యూటీ మేనేజర్ ( ప్యాసెంజర్) - 19 పోస్టులు
- డిప్యూటీ ఆఫీసర్ ( ప్యాసెంజర్) - 30 పోస్టులు
- డిప్యూటీ మేనేజర్ ( కార్గో) - 3 పోస్టులు
- డప్యూటీ ఆఫీసర్ ( కార్గో) - 8 పోస్టులు
- జూనియర్ ఆఫీసర్ ( కార్గో) - 9 పోస్టులు
- మొత్తం పోస్టులు - 828
విద్యార్హతలు
AIASL Job Qualifications :అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి.. పదో తరగతి సహా, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కొన్ని పోస్టులకు కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి.
వయోపరిమితి (గరిష్ఠంగా..)
AIASL Jobs Age Limit :
- ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 28 ఏళ్లు
- యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ - 28 ఏళ్లు
- డిప్యూటీ మేనేజర్ ర్యాంప్/ మెయింటెనెన్స్ - 55 ఏళ్లు
- డిప్యూటీ మేనేజర్ ర్యాంప్ - 55 ఏళ్లు
- జూనియర్ ఆఫీసర్ టెక్నికల్ - 28 ఏళ్లు
- డిప్యూటీ మేనేజర్ ( ప్యాసెంజర్) - 55 ఏళ్లు
- డిప్యూటీ ఆఫీసర్ ( ప్యాసెంజర్) - 50 ఏళ్లు
- డిప్యూటీ మేనేజర్ ( కార్గో) - 55 ఏళ్లు
- డప్యూటీ ఆఫీసర్ ( కార్గో) - 35 ఏళ్లు
- జూనియర్ ఆఫీసర్ ( కార్గో) - 35 ఏళ్లు
- కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 35 ఏళ్లు
- సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 50 ఏళ్లు
ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయా కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.