అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్నాడీఎంకే ప్రకటించిన మేనిఫెస్టో ఆశ్చర్యం కలిగించక మానదు. పార్లమెంటులో పౌరసత్వ చట్టానికి(సీఏఏ) అనుకూలంగా ఓటేసిన ఆ పార్టీనే.. ఇప్పుడు మేనిఫెస్టోలో సీఏఏ అమలును నిలిపివేసేలా కేంద్రాన్ని ఒప్పిస్తామని హామీ ఇచ్చింది. మరికొన్ని కీలక వాగ్దానాలతో తమిళ జాతీయవాదం వైపు అడుగులు వేస్తోంది. శ్రీలంకలోని తమిళులు, ప్రవాస తమిళుల కోసం ప్రత్యేక తమిళ ఈలం ఏర్పాటుకు డిమాండ్ చేస్తోంది.
బద్ధశత్రువులైన అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే.. ఓటర్లను ఆకర్షించేందుకు అప్పటి తమ సిద్ధాంతకర్తలు పెరియార్, అన్నాదురై బాటలో నడిచేందుకు మొగ్గు చూపుతున్నాయి. వారి వ్యవస్థాపక సూత్రాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇది ఇటీవల ఆయా పార్టీల నేతల భావాల్లో, స్వరాల్లో స్పష్టమైంది కూడా.
ఇదీ చూడండి: తమిళనాట పోటాపోటీగా 'ఉచిత హామీల' వల!
రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ఉమ్మడి సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి కూడా భాజపాతో పొత్తు ఎన్నికల వరకే పరిమితమని, సైద్ధాంతికంగా కాదని ఇటీవలే స్పష్టం చేశారు. దీనికి బలం చేకూరుస్తూ.. పార్లమెంటులో సీఏఏకు అనుకూలంగా ఓటు వేసిన అన్నాడీఎంకే... ఇప్పుడు అమలు నిలిపివేసేలా కేంద్రాన్ని ఒప్పిస్తామని చెబుతోంది.
అయితే ఎన్నికలకు ముందు సీఏఏపై అధికార పార్టీ వాగ్దానం మాత్రం.. భాజపాకు చికాకు, చిక్కులు తెప్పించేదే. దీనిపై ముందుకెళ్లడం అధికార పార్టీకి అంత సులువేం కాదు. సీఏఏను రద్దు చేయాలని.. కేంద్రాన్ని ఎలా ఒప్పిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
లంక-తమిళుల అంశంపై..
అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించకుండాపోయిందనుకున్న లంక-తమిళుల అంశాన్ని రెండు పార్టీలు మేనిఫెస్టోల్లో ప్రస్తావించాయి. శ్రీలంక శరణార్థులకు ద్వంద్వ పౌరసత్వం కల్పిస్తామని అధికార పార్టీ హామీ ఇవ్వగా.. డీఎంకే సైతం అలాంటి వాగ్దానమే చేసింది. తమిళ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో శ్రీలంక ప్రభుత్వానికి పూర్తి అధికారాలు దక్కేలా తాము పోరాడతామని పేర్కొంది.
ఇదీ చూడండి:తమిళ రాజకీయాల్లో 'వారు' మాయం- డీఎంకేకే లాభం!
భారత్లో ఉండాలనుకునేవారికి.. భారత పౌరసత్వం, శాశ్వత నివాస హోదా హామీపైనా రెండు పార్టీలు దాదాపు ఒకే అభిప్రాయంతో ఉన్నాయి.
ముఖ్యంగా లంక తమిళుల అంశం.. ద్రవిడ పార్టీల రాజకీయ ప్రధాన అంశాల్లో ఎప్పటినుంచో ఉంది. ఈ ఎన్నికలు దీనికేం మినహాయింపు కాదు. దానికి తగ్గట్లుగానే మేనిఫెస్టోల్లో సంబంధిత అంశాలను పొందుపర్చాయి.
తమిళవాదం..