తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఓటర్లకు డబ్బులు పంచిన అన్నాడీఎంకే నేత - ఓటుకు నోటు

తమిళనాడు శాసనపోరులో ఓటర్లను మభ్య పెట్టే కార్యక్రమం జోరుగా జరుగుతోంది. ఏఐఏడీఎంకే పార్టీ నేత చెపాక్-ట్రిప్లికేన్​ నియోజకవర్గంలో డబ్బులు పంచుతున్న వీడియో వైరల్​గా మారింది.

AIADMK handing out 'cash for votes' from Chepauk constituency
జోరుగా డబ్బులు పంచుతున్న ఏఐఏడీఎంకే నేత

By

Published : Mar 19, 2021, 10:28 PM IST

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటుకు నోటు వ్యవహారం జోరుగా సాగుతోంది. అధికార అన్నాడీఎంకేకు చెందిన మైనారిటీ విభాగ నేత జేఎం బషీర్ శుక్రవారం ఒక్కో ఓటుకు రూ.500 చొప్పున పంచుతున్న వీడియో వైరల్​గా మారింది. చెపాక్- ట్రిప్లికేన్ నియోజక వర్గంలో ఓటరు ఐడీలను పరిశీలించి, మహిళలకు ఆయన డబ్బులిచ్చారు.

జోరుగా డబ్బులు పంచుతున్న ఏఐఏడీఎంకే నేత

చెపాక్-ట్రిప్లికేన్​లో డీఎంకే నుంచి ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి బరిలో ఉన్నారు. అతనికి పోటీగా ఏఐఏడీఎంకే కూటమి భాగస్వామి పీఎంకే అభ్యర్థి నిలబడ్డారు. అంతకు ముందు అన్నాడీఎంకే మాజీ మంత్రి నాథమ్ విశ్వనాథన్​ కూడాఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు ఉన్న వీడియో కలకలం రేపింది. దానిపై దర్యాప్తునకు ఎన్నికల కమిషన్​ వద్దకు పంపారు.

ఇదీ చూడండి:తమిళ సీఎం అభ్యర్థుల ఆస్తుల లెక్కలు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details