తమిళనాడులోని నాగపట్టణం నియోజకవర్గంలో ఓ మహిళ దుస్తులు ఉతికారు అధికార అన్నాడీఎంకే అభ్యర్థి తంగకత్తిరవన్. నాగూర్లో శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన.. ఓ మహిళ బట్టలు ఉతకడం గమనించారు. అనంతరం ఆమెను పక్కకు తప్పుకోమని చెప్పి ఆయనే వాటిని ఉతికేశారు.
ఓటు కోసం మహిళ బట్టలుతికిన అన్నాడీఎంకే అభ్యర్థి - మహిళ దుస్తులు ఉతికిన అధికార అన్నాడీఎంకే అభ్యర్థి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు వారాలే ఉన్నందున ద్రవిడ పార్టీల ప్రచారం ఊపందుకుంది. తన నియోజకవర్గంలోని ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్నంగా ప్రయత్నించారు ఓ అన్నాడీఎంకే అభ్యర్థి. ప్రచారంలో భాగంగా ఆయన ఓ మహిళ దుస్తులు ఉతికారు.
ఓటు కోసం మహిళ బట్టలుతికిన అన్నాడీఎంకే అభ్యర్థి
ఆ దృశ్యాలను తంగకత్తిరవన్ అనుచరులు సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా, అవి వైరల్గా మారాయి. అయితే తాము మరోసారి అధికారం చేపడితే వాషింగ్ మెషీన్లు ఇస్తామని ఏఐఏడీఎంకే హామీ ఇవ్వడం గమనార్హం.
ఇదీ చూడండి:కమల్ నోట హంగ్ మాట- ప్రజలకు కీలక సూచన