Ahmedabad Bomb Blast Case: 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్లోని ప్రత్యేక కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో 49 మందిని దోషులుగా తేల్చింది. మరో 28 మందిని నిర్దోషులుగా పేర్కొంటూ ప్రత్యేక కోర్టు జడ్జి ఏఆర్ పటేల్ తీర్పునిచ్చారు. ఈ కేసులో మొత్తం 77 మంది నిందితులను విచారించిన కోర్టు.. ఘటన జరిగిన 13 ఏళ్ల తర్వాత తీర్పును వెలువరించింది.
దోషులకు శిక్ష ఖరారు చేయడంపై బుధవారం నుంచి వాదనలు వింటామని స్పష్టం చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ), ఐపీసీ 302(హత్య), ఐపీసీ 120-బీ సెక్షన్ల కింద 49 మంది నిందితులను దోషులుగా తేల్చినట్లు ప్రత్యేక కోర్టు న్యాయవాది అమిత్ పటేల్ పేర్కొన్నారు.