దుకాణంలోకి చొరబడి రూ. 50 లక్షల నగదును ఎత్తుకెళ్లారు నలుగురు దుండగులు. గన్‌తో యజమానిని బెదిరించి నగదును దోచుకున్నారు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒదేవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ చోరీ.. దుకాణంలో ఉన్న సీసీటీవీలో రికార్డైంది. ఈ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
అసలేం జరిగిందంటే: చోరీ సమయంలో నలుగురు దుకాణంలో ఉన్నారు. అందులో ఇద్దరు వ్యాపారులు కాగా, మరో ఇద్దరు షాపులో పనిచేస్తున్న యువకులు. అందులో ఒకర్ని తుపాకీతో బెదిరించి ఈ చోరీకి పాల్పడ్డారు. దుకాణం తలుపులన్నీ బయట నుంచి మూసేసి ఈ చోరికి పాల్పడ్డారు. చోరీకి పాల్పడిన అనంతరం ఒక దుండగుడు బైక్‌ను వదిలి పారిపోయాడు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. దుకాణంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నారు.