తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆస్పత్రిలో చేరిన అహ్మద్‌ పటేల్.. ఐసీయూలో చికిత్స‌ - కాంగ్రెస్​ సీనియర్​ లీడర్​

కొద్ది వారాల క్రితం కొవిడ్​ బారిన పడిన కాంగ్రెస్​ సీనియర్​ నేత అహ్మద్​ పటేల్​ ఆస్పత్రిలో చేరారు. గుర్​గావ్​లోని మేదంతా ఆసుపత్రిలో ఐసీయూలో ఆయనకు చికిత్స కొనసాగుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Ahmed Patel in ICU
ఆస్పత్రిలో చేరిన అహ్మద్‌ పటేల్

By

Published : Nov 15, 2020, 10:43 PM IST

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, గుజరాత్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు అహ్మద్‌పటేల్‌ ఆస్పత్రిలో చేరారు. కొద్ది వారాల క్రితం కొవిడ్‌ బారిన పడిన ఆయన తాజాగా గుర్‌గావ్‌లోని మేదంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఆయనకు చికిత్స కొనసాగుతోందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

71 ఏళ్ల పటేల్‌ తాను కొవిడ్‌ బారిన పడినట్లు అక్టోబర్‌ 1న ట్విటర్‌ ద్వారా తెలిపారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్లు ఆయన కుమారుడు ఫైజల్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం అని ట్వీట్‌ చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజకీయ సలహాదారు అయిన అహ్మద్‌ పటేల్‌ త్వరగా కోలుకోవాలని పలువురు కాంగ్రెస్‌ నేతలు ఆకాంక్షించారు. తన స్నేహితుడు త్వరగా ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆ పార్టీ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ ట్వీట్‌ చేశారు.

ఇదీ చూడండి: మణిపుర్​ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details