తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా భాజపా 'బూత్​ విజయ్​ అభియాన్​'

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో(UP assembly election 2022) విజయమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోంది భాజపా. అందులో భాగంగానే బూత్​ విజయ్​ అభియాన్​ను వర్చువల్​గా ప్రారంభించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. వచ్చే ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

BJP chief JP Nadda
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

By

Published : Sep 11, 2021, 5:26 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలకు(UP assembly election 2022) కొన్ని నెలలే సమయం ఉన్న క్రమంలో ప్రచార జోరును పెంచింది భారతీయ జనతా పార్టీ. 'బూత్​ విజయ్​ అభియాన్​'ను వర్చువల్​గా ప్రారంభించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఈ సందర్భంగా.. ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు.

బూత్​ విజయ్​ అభియాన్​ను ప్రారంభిస్తున్న జేపీ నడ్డా

"ప్రధాని మోదీ నాయకత్వంలో ఉండటం మనకు గర్వకారణం. దేశంలో కులతత్వం, కుటుంబం, మతతత్వ రాజకీయాలు ముగింపు దశకు చేరుకున్నాయి. అభివృద్ధి రాజకీయాలు ఊపందుకున్నాయి. మోదీ నాయకత్వంలో 2017ఎన్నికల్లో భాజపా 325 సీట్లు సాధించి చరిత్ర సృష్టించింది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో యూపీ ప్రజలు అభివృద్ధి రాజకీయాలకే మద్దతు పలికారు. భాజపా కార్యకర్తల ఉత్సాహం రాష్ట్ర భవిష్యత్తును స్పష్టంగా సూచిస్తోంది. ప్రజల ఆశీస్సులతో యూపీలో భాజపా ఘన విజయం సాధిస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. కేవలం యూపీలోనే కాదు.. ఉత్తరాఖండ్​, గోవా, మణిపుర్​లలోనూ భాజపా తిరిగి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేస్తున్నాయి. "

- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

ఈ నేపథ్యంలోనే విపక్షాలపై విమర్శలు గుప్పించారు నడ్డా. ఓవైపు పార్లమెంట్​ సమావేశాలు జరుగుతున్నప్పటికీ వ్యాక్సిన్​ కోసం విదేశాలకు వెళ్లిన రాజకీయ నాయకులు ఉన్నారని ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో భాజపా మినహా ఇతర పార్టీల నేతలు లాక్​డౌన్​లోకి వెళ్లారని, క్వారంటైన్​లో గడిపారని ఆరోపించారు. ప్రజల ప్రాణాలు రక్షించేందుకు భాజపా కార్యకర్తలు తమ జీవితాన్ని రిస్క్​లో పెట్టారని గుర్తు చేశారు.

ఇదీ చూడండి:గుజరాత్​ రాజకీయాల్లో అనూహ్య మలుపు.. తదుపరి సీఎం ఎవరు?

ABOUT THE AUTHOR

...view details