తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.3,600 కోట్ల కుంభకోణంలో రక్షణశాఖ మాజీ కార్యదర్శిపై ఛార్జిషీటు - అగస్టా వెస్ట్​ల్యాండ్ కేసు

Shashi Kant Sharma: రూ.3,600 కోట్ల కుంభకోణానికి సంబంధించిన అగస్టా వెస్ట్​ల్యాండ్ కేసులో రక్షణశాఖ మాజీ కార్యదర్శిపై సీబీఐ ఛార్జ్​షీటు దాఖలు చేసింది.

AgustaWestland scam
AgustaWestland scam

By

Published : Mar 17, 2022, 8:40 AM IST

Agusta Westland scam అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణంలో రక్షణశాఖ మాజీ కార్యదర్శి శశికాంత్‌ శర్మతో పాటు నలుగురు భారత వైమానిక దళ (ఐఏఎఫ్‌) మాజీ అధికారులపై సీబీఐ అనుబంధ అభియోగపత్రం దాఖలు చేసింది. రూ. 3,600 కోట్ల ఈ కుంభకోణానికి సంబంధించి.. దిల్లీలోని ప్రత్యేక కోర్టులో అభియోగ పత్రాన్ని (ఛార్జిషీటు) దాఖలు చేసినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. 2011-2013 మధ్య రక్షణ కార్యదర్శిగా పనిచేసిన శర్మ అనంతరం కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌గా నియమితులయ్యారు. ఆయనను ప్రాసిక్యూట్‌ చేసేందుకు ప్రభుత్వ అనుమతి పొందిన అనంతరం సీబీఐ తాజా ఛార్జిషీటు దాఖలు చేసింది. ఇందులో అప్పట్లో వివిధ హోదాల్లో పనిచేసిన నలుగురు అధికారుల (ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ జస్బీర్‌ సింగ్‌ పనేసర్‌, డెప్యూటీ చీఫ్‌ టెస్ట్‌ పైలట్‌ ఎస్‌.ఏ.కుంతే, వింగ్‌ కమాండర్‌ థామస్‌ మాథ్యూ, గ్రూప్‌ కెప్టెన్‌ ఎన్‌.సంతోష్‌) పేర్లు కూడా నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలులో అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కంపెనీకి అనుకూలంగా పనిచేసేందుకు ముడుపులు తీసుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈమేరకు ఐఏఎఫ్‌ మాజీ అధిపతి ఎస్‌.పి.త్యాగి, మరికొందరిపై 2017 సెప్టెంబరులో తొలి అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. అలాగే ఈ కేసులో మధ్యవర్తులు కొందరిపై 2020 సెప్టెంబరులో మరో ఛార్జిషీటు వేసింది.

ఇదీ చదవండి:రూ.75 లక్షలకే కశ్మీర్​ను అమ్మేసిన బ్రిటిష్ ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details