తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తోమర్​ వ్యాఖ్యలపై మళ్లీ పవార్​ కౌంటర్​ - narendra singh tomar

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​, ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్​ పవార్​ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తొలుత సాగు చట్టాలను విమర్శిస్తూ పవార్​ ట్వీట్​ చేయగా.. తోమర్​ తప్పుబట్టారు. రైతులను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేయొద్దని అన్నారు. ప్రతిగా.. పవార్​ మళ్లీ తోమర్​ వ్యాఖ్యలకు కౌంటర్​ ఇచ్చారు. వ్యవసాయ బిల్లుపై వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం లేదని ఆరోపించారు.

By

Published : Feb 1, 2021, 6:50 AM IST

సాగు చట్టాలపై తాను చేసిన ట్వీట్లను విమర్శించిన వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ వ్యాఖ్యలను కౌంటర్‌ చేస్తూ ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ మళ్లీ ట్వీట్ చేశారు. వ్యవసాయ బిల్లుపై సరైన వాస్తవాలను తోమర్ వెలుగులోకి తీసుకురావడం లేదని ఆరోపించారు.

కొత్త చట్టాలు.. వ్యవసాయ మార్కెట్లను ప్రభావితం చేయవని మంత్రి హామీ ఇస్తున్నప్పటికీ రైతు సంఘాల దృష్టిలో చట్టంలోని నిబంధనలు కార్పొరెట్‌ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయన్నారు. కొత్త చట్టం ప్రకారం రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్‌ వెలుపల అమ్ముకోవచ్చు కానీ తమ ఉత్పత్తులను ప్రైవేట్ కొనుగోలుదారులకు విక్రయించేటప్పుడు కనీస మద్ధతు ధరకు రక్షణ ఉండదని వివరించారు.

ఆందోళన చేస్తున్న రైతులు మొదటి నుంచి చెబుతున్నది ఇదేనని ట్వీట్‌ చేశారు.

శరద్​ పవార్​ ట్వీట్​

అంతకుముందు.. సాగు చట్టాలను విమర్శిస్తూ ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ చేసిన ట్వీట్లను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తప్పుబట్టారు. రైతు సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న ఆయన.. వారిని పక్కదారి పట్టించేలా వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. దీనిపైనే మళ్లీ కౌంటర్​ ఇచ్చారు పవార్​.

ఇదీ చూడండి:సాగు చట్టాలపై​ పవార్​ ట్వీట్ల​కు తోమర్​ కౌంటర్​​

ABOUT THE AUTHOR

...view details