తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఊరిలో రోడ్డు కోసం 81 రోజులపాటు పోరాటం.. చివరకు టెంట్​లోనే!

Agra Woman Protest: ఆగ్రాకు చెందిన ఓ మహిళ.. రోడ్ల కోసం నిరసన చేపడుతూనే ప్రాణాలు విడిచారు. 81 రోజుల పాటు నిర్విరామంగా పోరాటం చేసిన ఆమె.. ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

Agra Woman Protest
నిరసన స్థలంలో మహిళ మృతి

By

Published : Jan 3, 2022, 5:25 PM IST

Agra Woman Protest: రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థలను బాగు చేయాలని 81రోజులుగా నిరసన చేస్తూ.. ఓ మహిళ చివరకు ప్రాణాలు విడిచారు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రాలో జరిగింది. ఆమెతో పాటే నిరసనలో పాల్గొన్న ఓ 85 ఏళ్ల వృద్ధురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

ఆ మూడు గ్రామాల కోసం..

ఆగ్రాలోని వికాశ్​నగర్​కు చెందిన రాణి దేవీ(48 ).. సామాజిక కార్యకర్త సావిత్రి చాహర్​ ఆధ్వర్యంలో గతేడాది అక్టోబరులో ఆందోళనలు చేపట్టారు. ధనోలీ, అజీజ్​పుర, సిరోలీ గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ బాగుచేయాలనేది వారి డిమాండ్​. అక్టోబరు 13న ప్రారంభమైన రాణి దేవీ నిరసన ఇంతకాలం.. నిర్విరామంగా సాగుతూ వచ్చింది. వివిధ రకాలుగా వారు నిరసనను తెలిపారు. తమ ఇళ్లను అమ్మకానికి పెడుతున్నట్లు గోడల మీద పోస్టర్లు అంటించి ఆందోళన వ్యక్తం చేశారు.

వద్దంటున్నా..

సిరోలీ-ధనోలీ రోడ్డు మార్గంలో ఇంతకాలం నిరసన చేపట్టారు దేవీ. శనివారం రాత్రి కూడా నిరసన స్థలంలోనే ఉన్నారు. కుమారుడు నీరజ్​.. వద్దని వారిస్తున్నా వినకుండా పట్టుదలతో దీక్ష కొనసాగించారు. అయితే ఆదివారం ఉదయం టీ ఇద్దామని వెళ్లిన కుమారుడు అక్కడి దృశ్యాలు చూసి షాక్​ అయ్యాడు. దేవీ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి విలపించాడు. వైద్యులను సంప్రదించగా ఆమె అప్పటికే మృతిచెందినట్లు నిర్ధరించారు.

తన తల్లి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్​ చేశారు నీరజ్.

85 ఏళ్ల మహిళ కూడా..

రాణితో కలిసి ఈ నిరసనలో పాల్గొన్న కృతి దేవీ అనే 85 ఏళ్ల మహిళ.. అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. కృతి దేవీని అధికారులు ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై స్పందించిన అధికారులు.. బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్​ ఫండ్​ నుంచి ఆర్థిక సాయం సహా ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి చేకూరేలా కృషి చేస్తామని తెలిపారు. ధనోలీ సహా సమీప ప్రాంతాల అభివృద్ధి కోసం రూ.43 కోట్లు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. స్థానికుల డిమాండ్​ మేరకు రోడ్ల నిర్మాణం కూడా చేపడుతున్నామని పేర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చూడండి:రైల్వే టికెట్ కౌంటర్​పై దొంగల కన్ను- రద్దీగా ఉండే స్టేషన్​లోనే చోరీ

ABOUT THE AUTHOR

...view details