ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ ప్రియాంక మిశ్రాపై ఇటీవల ట్రోల్స్ ఎక్కువగా వచ్చాయి. దీనికి కారణం.. ఇన్‌స్టాలో ఆమె చేసిన వీడియో! ట్రోల్స్‌ను భరించలేక.. చివరికి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు ప్రియాంక.
ప్రియాంక.. ఆగ్రాలోని ఎంఎం గేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించేవారు. ఆ సమయంలోనే పోలీస్ యూనిఫాం ధరించి, చేతిలో రివాల్వర్ పట్టుకుని ఆమె చెప్పిన వివాదస్పద డైలాగ్.. నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోతో ఆమె ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. అదే సమయంలో కొందరు ఈ వీడియోను తెగ ట్రోల్ చేశారు. వీడియో కింద అసభ్యకరమైన కామెంట్లూ పోస్ట్ చేశారు.