ఉత్తర్ప్రదేశ్ ఆగ్రాలో విషాద ఘటన వెలుగుచూసింది. సెప్టిక్ ట్యాంకులో పడి ముగ్గురు మైనర్ సోదరులు సహా మరో ఇద్దరు చనిపోయారు.
ఇదీ జరిగింది
ఫతేహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి అనురాగ్(10), హరిమోహన్(16), అవినాష్(12), రామ్ ఖిలాడిలు ఆడుకుంటూ.. సెప్టిక్ ట్యాంకులో పడిపోయారు. ట్యాంకులో మునిగిపోతున్న వారిని గుర్తించిన సోను(25).. రక్షించే ప్రయత్న చేశాడు. ఈ క్రమంలోనే అతను అందులో జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. మరణించినవారిలో హరిమోహన్, అవినాష్, అనురాగ్ సోదరులు.