పోలీస్ బదిలీని నిలిపివేయాలంటూ Agra Residents Dharna For Cop: ఆ పోలీస్ అధికారంటే స్థానికులకు ఎంతో ఇష్టం. ఆయన్ను ఇంట్లో మనిషిలా భావించేవారు. అయితే ఇటీవల ఆ అధికారి బదిలీ అయ్యారు. దీంతో ఆ పోలీస్ అధికారి బదిలీని నిరసిస్తూ.. రోడ్డుపైనే ధర్నాకు దిగారు స్థానికులు.
ఏమైందంటే..?
ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రాలోని పినాహట్ పోలీస్ స్టేషన్లో ప్రమోద్‌కుమార్ శర్మ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇటీవల ఆయన్ను ఆగ్రాలోని రాకబ్ఘంజ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు ఆగ్రా ఎస్పీ సుధీర్ కుమార్ సింగ్.
పెద్దఎత్తున స్థానికుల ధర్నా అయితే ప్రమోద్ కుమార్ బదిలీని నిరసిస్తూ.. రోడ్డుపై ధర్నాకు దిగారు స్థానికులు. దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, ఇతర వ్యాపారసంస్థలను మూసివేసి ఈ ధర్నాలో పాల్గొన్నారు. శర్మ.. నిజాయతీ గల అధికారి అని, ఆయన్ను వదులుకోవడం తమకు లేదని, ఇంట్లో కుటుంబసభ్యుడిగా ఆయన్ను చూశామని స్థానికుడు సతీష్ చతుర్వేది తెలిపాడు.
ధర్నాలో పాల్గొన్న స్థానికులు పోలీస్ బదిలీని నిలిపివేయాలంటూ అయితే.. తనకోసం ధర్నా చేయొద్దని ప్రమోద్ శర్మ స్థానికులను కోరారు. డిపార్ట్మెంట్ రూల్స్‌ను తాను పాటించాలని, ఎవరూ భావోద్వేగానికి గురికావొద్దన్నారు. ఎక్కడికి బదిలీ అయినా మిమ్మల్ని కలుస్తానన్నారు.
ఇదీ చూడండి:వింత ఆచారం.. ముళ్ల కంపపై దొర్లుతూ సోదరికి వీడ్కోలు!