తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రికార్డు స్థాయిలో 93 సార్లు ఎన్నికల్లో ఓటమి.. మళ్లీ బరిలోకి.. - హస్నురాం

UP Election 2022: 94వ సారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు పట్టువదలని విక్రమార్కుడు హస్నురాం అంబేడ్కరీ. ఇప్పటివరకు పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోయిన ఆయన.. ఇటీవలే ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు.

UP Election 2022
Uttar Pradesh polls

By

Published : Jan 15, 2022, 6:15 AM IST

UP Election 2022: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 94వ సారి ఎన్నికల్లో పోటీ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన హస్నురాం అంబేడ్కరీ. ఆయన వయసు 75 ఏళ్లు. స్వస్థలం ఆగ్రా. హస్నురాం గతంలో రెవెన్యూ విభాగంలో క్లర్క్​గా పనిచేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ పార్టీ టికెట్​ ఇస్తామనడం వల్ల.. 1985లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే.. తర్వాత ఆ పార్టీ మాట మార్చింది. టికెట్ నిరాకరించింది. ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక్క ఓటు కూడా రాదంటూ ఆయన్ను ఆ పార్టీ నేతలు ఎగతాళి చేశారు. దీంతో అదే ఏడాది తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన హస్నురాం.. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు.

అసెంబ్లీ, లోక్​సభ, గ్రామపంచాయతీ.. ఇలా ఏ స్థాయిలో ఎన్నికలు జరిగినా నామినేషన్ వేస్తున్నారు హస్నురాం. ఇప్పటివరకు ఆయన 93సార్లు బరిలోకి దిగారు. అయితే ఎప్పుడూ విజయం వరించలేదు. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నం కొనసాగిస్తున్న హస్నురాం.. ఇటీవలే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ నామినేషన్​ దాఖలు చేశారు.

పరాజయాలు కొనసాగినా 100 ఎన్నికల్లో బరిలో దిగడమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం తాను వ్యవసాయం చేస్తున్నానని, పొట్టకూటి కోసం అప్పుడప్పుడు ఉపాధి హామీ పనులకు కూడా వెళ్తుంటానని తెలిపారు. హస్నురాం ఓసారి రాష్ట్రపతి పదవికీ నామినేషన్​ వేయగా.. అది తిరస్కరణకు గురైంది.

ఇదీ చూడండి:యూపీలో అత్యాచార బాధితురాలి తల్లికి కాంగ్రెస్ టికెట్​

ABOUT THE AUTHOR

...view details