తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సాగు చట్టాలపై కర్షక భారతం కన్నెర్ర

రైతులకు మద్దతుగా యావత్​ దేశం నిరసనలతో హోరెత్తింది. దాదాపు 25 రాజకీయ పార్టీలు సహా అనేక సంఘాలు భారత్​ బంద్​లో పాల్గొన్నాయి. అన్నదాతలకు మద్దతుగా ఆందోళనలు నిర్వహించాయి. మహారాష్ట్ర, బంగాల్​, ఒడిశాలో రైల్​ రోకో నిర్వహించారు నిరసనకారులు. బంద్ నేపథ్యంలో దిల్లీ సరిహద్దులో బలగాలను భారీగా మోహరించారు.

agitating-farmers-call-for-bharat-bandh-today
రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనల హోరు

By

Published : Dec 8, 2020, 10:55 AM IST

నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘూలు తలపెట్టిన భారత్​ బంద్​కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. దాదాపు 25 రాజకీయ పార్టీలు, రైతు, కార్మిక సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. రైతుల డిమాండ్​ మేరకు సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని నినదించాయి. పలు చోట్ల రైల్​ రోకో నిర్వహించి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు నిరనసకారులు.

మహారాష్ట్రలో..

రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనల హోరు

భారత్​ బంద్​కు మద్దతుగా మహారాష్ట్రలోని 'స్వాభిమాని శెట్కారి సంఘటన' రైతు సంఘం రైల్​ రోకో నిర్వహించింది. బుల్ధానా జిల్లా మల్కాపుర్​లోని రైల్వే స్టేషన్లో ట్రాక్​పై ఆందోళనలు చేపట్టింది. ఓ రైలును బయల్దేరకుండా నిరసనకారులు అడ్డుకోగా.. రంగంలోని దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనల హోరు

ఒడిశాలో..

రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనల హోరు

రైతులకు మద్దతుగా ఒడిశా భువనేశ్వర్​లో రైల్​ రోకో నిర్వహించాయి వామమక్షాలు. భువనేశ్వర్​ రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకలను అడ్డుకున్నాయి. కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఇందులో పాల్గొన్నాయి.

రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనల హోరు

కర్ణాటకలో..

రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనల హోరు

భారత్ బంద్​కు మద్దతుగా కర్ణాటకలో కాంగ్రెస్​ నేతలు ఆందోళనలు నిర్వహించారు. బెంగళూరు విదాన్​ సౌధ వద్ద గాంధీ విగ్రహం ముందు నల్ల జెండాలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. నూతన సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు సిద్ధరామయ్య, బీకే హరిప్రసాద్​, రామలింగా రెడ్డి ఈ నిరసనల్లో పాల్గొన్నారు.

రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనల హోరు

కర్ణాటక కలబురిగిలో వామమక్ష అనుబంధ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశాయి.

బంగాల్​లో..

రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనల హోరు
రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనల హోరు

బంగాల్​ రాజధాని కోల్​కతాలోని జాదవ్​పుర్ రైల్వే స్టేషన్లో వామపక్షాలు ఆందోళనలు నిర్వహించాయి. భారత్​ బంద్​కు మద్దతుగా రైల్​ రోకో చేపట్టాయి. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశాయి.

బిహార్​లో

బిహార్​లో ప్రతిపక్ష ఆర్జేడీ.. రైతులకు మద్దతుగా ఆందోళనలు నిర్వహించింది. దర్భంగాలోని గన్​చౌక్​ వద్ద టైర్లకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు ఆ పార్టీ కార్యకర్తలు. భారత్ ​బంద్​కు మద్దతు తెలిపారు.

రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనల హోరు

దిల్లీలో బందోబస్తు..

దిల్లీలో బందోబస్తు

భారత్ బంద్ నేపథ్యంలో దిల్లీలో భారీగా బలగాలను మోహరించారు అధికారులు. సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. సింఘు, టిక్రీ, ఘాజిపూర్ సహా పలు దిల్లీ సరిహద్దు రోడ్లను మూసివేశారు.

దిల్లీలో బందోబస్తు

ABOUT THE AUTHOR

...view details