తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ నెల 23 నుంచి రైతు నిరసనలు ఉద్ధృతం - ఎస్​కేఎం నేతలు రైతుల ఆందోళన

నూతన సాగు చట్టాల రద్దుకోసం ఉద్యమిస్తున్న రైతులు.. ఈ నెల 23 నుంచి 27 వరకు వరుస నిరసన కార్యక్రమాల్ని చేపట్టనున్నారు. తమ ఉద్యమాన్ని విస్తృతం చేసేందుకు త్వరలోనే ఓ వ్యూహాన్ని రూపొందిస్తామని చెప్పారు. ప్రభుత్వం తమపై అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందని ఆరోపించారు.

Agitating farmers announce series of events
ఈ నెల 23 నుంచి రైతుల వరుస నిరసన కార్యక్రమాలు

By

Published : Feb 21, 2021, 8:10 PM IST

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అన్నదాతలు తమ ఆందోళనను ఉద్ధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 23- 27 మధ్య వరుస నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆదివారం ప్రకటించారు. ప్రభుత్వం తమపై అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందని వారు ఆరోపించారు. ఆందోళనలను విస్తృతం చేసేందుకు త్వరలో ఒక వ్యూహాన్ని రూపొందిస్తామని చెప్పారు. ఈ మేరకు సంయుక్త కిసాన్​ మోర్చా(ఎస్​కేఎం) నేతలు తెలిపారు.

ఆందోళనల్లో భాగంగా.. ఫిబ్రవరి 23న పగాడి సంభాల్​ దివస్​గా, ఫిబ్రవరి 24న 'దామన్​ విరోధి దివస్'​గా నిరసనలు నిర్వహిస్తామని ఎస్​కేఎం నాయకులు తెలిపారు. ఫిబ్రవరి 26న 'యువరైతు దినోత్సవం', ఫిబ్రవరి 27న 'మజ్దూర్​-కిసాన్​ ఏక్తా దివస్​(రైతు, కార్మిక ఐక్య దినోత్సవం)గా జరుపుతామని చెప్పారు.

ప్రభుత్వం తమ ఉద్యమాన్ని అణచి వేయాలని యత్నిస్తోందని రైతు నాయకుడు యోగేంద్ర యాదవ్​ ఆరోపించారు. సింఘు సరిహద్దులో తమ బలం పెరిగిందని, అంతర్జాతీయ సరిహద్దులా మారిందని వ్యాఖ్యానించారు. ట్రాక్టర్​ ర్యాలీ నేపథ్యంలో 122 మంది రైతులను దిల్లీ పోలీసులు అరెస్టు చేయగా.. 33 మందికి మాత్రమే బెయిల్​ దొరికిందని మరో నేత దర్శన్​పాల్​ తెలిపారు.

ఇదీ చదవండి:పెట్రో ధరలు తగ్గించాలని మోదీకి సోనియా లేఖ

ABOUT THE AUTHOR

...view details