Drunken Girl News: బాయ్‌ఫ్రెండ్‌తో గొడవ పెట్టుకుని రోడ్డుపై ఓ అమ్మాయి హల్చల్ చేసింది. చేయి కోసుకుని భీభత్సం సృష్టించింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం నైనీతాల్‌లో జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం..ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూ నగరానికి చెందిన అమ్మాయి తన స్నేహితురాలితో ఉత్తరాఖండ్‌లోని నైనితాల్‌ను సందర్శించడానికి వెళ్లింది. ఇద్దరూ తల్లీతాల్ ప్రాంతంలోని ఓ హోటల్లో ఉన్నారు. గురువారం రాత్రి ఆ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌తో ఫోన్లో మాట్లాడింది. మాటలు కాస్తా వాగ్వాదానికి దారితీశాయి. అనంతరం మద్యం సేవించింది యువతి.. హోటల్ నుంచి బయటకు వచ్చి రోడ్డుపై హల్చల్ చేసింది. తర్వాత తన చేయి కోసుకుంది. గాయాలపాలైన ఆమెను స్థానికులు బీడీ పాండే ఆస్పత్రికి తరలించారు. మణికట్టుకు గాయమైందని.. ప్రథమ చికిత్స చేసి డిశ్చార్జ్ చేశామని ఆమెకు వైద్యం చేసిన డాక్టర్ చెప్పారు. ఘటనకు సంబంధించి ఆ అమ్మాయిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
బాయ్‌ఫ్రెండ్‌తో గొడవ, మద్యం సేవించి చేయి కోసుకున్న యువతి - నైనిటాల్లో చేయి కోసుకున్న అమ్మాయి
బాయ్‌ఫ్రెండ్‌తో గొడవ పెట్టుకుని ఓ యువతి రోడ్డుపై వీరంగం సృష్టించింది. అనంతరం చేయి కోసుకుంది. గాయపడిన అమ్మాయిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని నైనీతాల్‌లో జరిగింది.
After spat with beau, drunken girl slits her wrist, creates ruckus in Nainital