కేరళలో ఆదివారం కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 29,836 మంది వైరస్ బారినపడ్డారు. మహమ్మారి ధాటికి మరో 75 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో కొత్తగా 4,666 కేసులు నమోదయ్యాయి. మరో 131మంది మరణించారు.
మిగతా రాష్ట్రాల్లో ఇలా..
తమిళనాడులో 1,578 మంది మహమ్మారి బారినపడ్డారు. 1,753 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మరో 22 మంది ప్రాణాలు కోల్పోయారు.