రాజస్థాన్‌లో వెలుగులోకి వచ్చిన బర్డ్ ఫ్లూ కేసులు మధ్యప్రదేశ్‌లోనూ నమోదయ్యాయి. ఇందోర్‌లో మూడు రోజుల క్రితం చనిపోయిన కాకులకు ఈ వైరస్ ఉన్నట్లు తేలింది. గత నాలుగు రోజుల్లో ఈ ప్రాంతంలో 96 కాకులు మరణించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఐదు కిలోమీటర్ల పరిధిలో ఎవరూ తిరగకుండా.. కర్ఫ్యూ విధించారు. ఫ్లూ సోకినట్లు అనుమానం ఉన్న పక్షులను గుర్తించే పనిలో పడ్డారు.
"దాదాపు యాభై కాకులు డేలీ కాలేజీ వద్ద పడిపోయి ఉన్నాయి. అందులో కొన్ని మృతదేహాల నమూనాలను భోపాల్‌కు పంపించాం. రెండింటిలో హెచ్5ఎన్8 వైరస్, మిగిలినవాటిలో ఏవియన్ ఇన్ఫ్ల్యుయెంజా(బర్డ్ ఫ్లూ) ఉన్నట్లు గుర్తించాం."
-పూర్ణిమా గదారియా, ఇందోర్ ముఖ్య వైద్యాధికారి