తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత నావికాదళానికి సరికొత్త శక్తి

హిందూ మహాసముద్ర ప్రాంతంలో నావికా దళ నిఘా సామర్థ్యాన్ని పెంచే విధంగా.. 10 డ్రోన్లను కొనేందుకు కేంద్రం అంగీకరించింది. భారత నావికాదళ అభ్యర్థన.. రక్షణ మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

After predator drone lease govt approves Indian navy proposal to buy shipborne drones
భారత నావికాదళానికి కొత్త శక్తి

By

Published : Jan 1, 2021, 10:14 PM IST

ఇప్పటివరకూ అమెరికా డ్రోన్లను లీజుకు తీసుకొని వినియోగించుకున్న భారత నావికాదళానికి 10 నూతన డ్రోన్లను కొనేందుకు కేంద్రం అంగీకరించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన నిఘా సామర్థ్యాలను విస్తరించేందుకు నావికా దళానికి ఈ డ్రోన్లు ఎంతగానో ఉపకరిస్తాయి.

"భారత నావికాదళ అభ్యర్థన రక్షణ మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. ఈ మానవ రహిత వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రూ.1,300 కోట్లు వెచ్చిస్తోంది" అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బై గ్లోబల్ కేటగిరీ కింద నేవీ ఓపెన్‌ బిడ్‌ ద్వారా ఈ డ్రోన్లను కొనుగోలు చేయనుంది. "వీటిని సముద్రజాలల్లో నిఘా కోసం వినియోగిస్తారు. ముఖ్యంగా చైనీయుల కార్యకలాపాలతో పాటు ఇతరుల కదలికలు గుర్తించడంలో సహకరిస్తాయి" అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట!

ABOUT THE AUTHOR

...view details