తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జెండాను అపవిత్రం చేశాడని దాడి- ఒకరు మృతి - sacrilege bid at the Golden Temple

Man beaten to death: పంజాబ్​లో ప్రజల దాడిలో మరో వ్యక్తి మృతిచెందాడు. సిక్కుల జెండాను అగౌరవపరిచాడన్న కారణంతో దాడి చేయగా ఆ వ్యక్తి చనిపోయినట్లు తెలుస్తోంది. అమృత్​సర్​ స్వర్ణదేవాలయాన్ని అపవిత్రం చేయబోయాడన్న కారణంతో భక్తులు చేసిన దాడిలో శనివారం కూడా ఓ వ్యక్తి మృతిచెందాడు.

One more beaten to death for alleged sacrilege attempt in Punjab
One more beaten to death for alleged sacrilege attempt in Punjab

By

Published : Dec 19, 2021, 4:11 PM IST

Updated : Dec 19, 2021, 4:37 PM IST

Man beaten to death: అమృత్​సర్​లోని స్వర్ణదేవాలయాన్ని అపవిత్రం చేయబోయాడన్న కారణంతో ఓ వ్యక్తిని భక్తులు కొట్టి చంపిన 24 గంటల వ్యవధిలో అలాంటిదే మరో ఘటన జరిగింది. పంజాబ్​ కపుర్తలాలోని నిజాంపుర్​లో.. ఓ వ్యక్తిపై ప్రజలు దాడి చేయగా అతడు ప్రాణాలు కోల్పోయాడు.

Man disrespected the Nishan Sahib: ఆ వ్యక్తి సిక్కుల జెండాను (నిషాన్​ సాహిబ్​) అగౌరవపరిచి, పారిపోతుండగా దాడి చేసినట్లు ప్రజలు చెబుతున్నారు.

స్థానికులు అతడిని కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది.

స్వర్ణ దేవాలయంలో..

స్వర్ణ మందిరంలోకి శనివారం ఓ ఆగంతుకుడు చొరబడ్డాడు. మందిరంలోని గురుగ్రంథ్‌ సాహిబ్‌ను అపవిత్రం చేసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన స్వర్ణ మందిరం భద్రతా సిబ్బంది ఆగంతుకుడిని అడ్డుకున్నారు. గురుగ్రంథ్‌ సాహిబ్‌ను అపవిత్రం చేసేందుకు యత్నించగా.. అక్కడే ఉన్న భక్తులు అతడిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

మృతునిపై కేసు నమోదు..

స్వర్ణ దేవాలయంలోకి చొరబడ్డ ఆ వ్యక్తి వివరాలను తెలుసుకొనేందుకు పంజాబ్​ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను మొత్తం క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఆలయం ఆవరణలో అతడు కొన్ని గంటలు గడిపినట్లు పోలీసులు నిర్ధరించారు.

శనివారం ఉదయం 11 గంటలకు ఆలయంలోకి వచ్చిన ఆగంతుకుడు.. అకాల్​ తఖ్త్​ ఎదుట కొన్ని గంటలు నిద్రించినట్లు పోలీసులు గుర్తించారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నిందితుడు గురుగ్రంథ్​ సాహిబ్​ను అపవిత్రం చేసేందుకు ప్రయత్నించినట్లు వివరించారు. అతడి వద్ద ఫోన్​, పర్స్​, గుర్తింపు కార్డుల్లాంటివి ఏమీ లేవని వెల్లడించారు.

మరణించిన నిందితుడిపై ఐపీసీ సెక్షన్​ 295ఏ(ఉద్దేశపూర్వకంగా మతపర విశ్వాసాలను అవమానించడం, ఆగ్రహానికి గురిచేయడం) సహా 307(హత్యాయత్నం) కింద కేసు నమోదు చేశారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుఖ్విందర్​ సింగ్​ రంధావా. గురుద్వారా సాహిబ్​లో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని, దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:స్వర్ణదేవాలయంలో ఆగంతుకుడు హల్​చల్​.. భక్తుల దాడిలో మృతి

Last Updated : Dec 19, 2021, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details