గతేడాది గల్వాన్ లోయలో(Galwan Valley) ఘర్షణ, లద్దాఖ్‌లో ప్రతిష్టంభన తర్వాత తర్వాత పర్వత ప్రాంతంలో పోరాడేందుకు మరింత శిక్షణ, సన్నద్ధత అవసరమని చైనా సైన్యం గ్రహించిందని త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. చైనా సైనికులకు స్వల్పకాలిక పోరాటాల్లో మాత్రమే అనుభవం ఉందని.. హిమాలయ పర్వతాల్లో పోరాడే అనుభవం లేదన్నారు.
ఇదీ చదవండి:గల్వాన్ ఘటనకు ఏడాది.. పరిస్థితి మారిందా?
" గతేడాది మే-జూన్‌లో గల్వాన్ లోయ, ఇతర ప్రాంతాల్లో ఘర్షణల తర్వాత చైనా బలగాల మోహరింపులో మార్పులు వచ్చాయి. పర్వతాల్లో పోరాడేందుకు మరింత శిక్షణ, సన్నద్ధత అవసరమని వారికి అర్థమైంది. నగరాల్లో గస్తీ నిర్వహించేవారికి సైన్యంలోకి ఎక్కువగా తీసుకుంటారు. వారికి శిక్షణ సమయం కూడా తక్కువ. ఇలాంటి పర్వత ప్రాంతాల్లో పోరాటాలు చేయటం వారికి తెలియదు."
-- బిపిన్ రావత్, త్రిదళాధిపతి
ఇదీ చదవండి:చైనాకు చలి భయం- లద్దాఖ్ నుంచి రివర్స్ గేర్!
ఎప్పుడైనా సిద్ధం..
జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో చాలా మంది సైనికులను చైనా కోల్పోయిందని రావత్ అన్నారు. సుశిక్షితులైన భారత సైన్యం వల్ల ఆక్రమించిన ప్రాంతాల్లో వెనక్కి తగ్గాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. వాస్తవాధీన రేఖ వెంట చైనా కార్యకలాపాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోందన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:లద్దాఖ్ సమీపంలో మళ్లీ చైనా సైన్యం కదలికలు